Sunday, June 21, 2026 06:17 AM
Sunday, June 21, 2026 06:17 AM

ఆ ఒక్కడు కూడా ఎన్కౌంటర్..? మావోయిస్ట్ చరిత్ర ముగిసినట్టే..?

1967 లో నక్సల్బరీ గ్రామంలో మొదలైన మావోయిస్ట్ ఉద్యమం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చ్ 31 నాటికి దేశంలో మావోయిస్ట్ లను లేకుండా చేస్తామని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో.. ఆపరేషన్ కగార్ ను బలగాలు తీవ్రతరం చేసాయి. చత్తీస్ఘడ్ లోని ఆఖరి కోటను కూల్చడంలో బలగాలు విజయవంతం అయ్యాయి అనే చెప్పాలి. ఒకప్పుడు 30 వేల మందితో అత్యంత పటిష్టంగా ఉన్న మావోయిస్ట్ పార్టీ.. నేడు కేవలం 500 మందికి మాత్రమే పరిమితం అయింది.

Also Read : మల్లోజుల మరో సంచలన వీడియో.. చనిపోవద్దు ప్లీజ్..!

2000 సంవత్సరం ప్రారంభంలో మావోయిస్ట్ పార్టీ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండేది. మొత్తం 125 జిల్లాల్లో మావోయిస్ట్ లు శక్తివంతమైన ప్రభావం చూపించారు. ఆ తర్వాత 2004 లో చర్చల తర్వాతి నుంచి అగ్ర నేతలను ఒక్కొక్కరిని మావోయిస్ట్ లు కోల్పోతూ వచ్చారు. 2010 ముందు వరకు కొంత ప్రభావం చూపించిన అన్నలు.. 2018 తర్వాతి నుంచి ప్రాభవం కోల్పోతూ వచ్చారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ సహా ఎన్నో ఆపరేషన్ లు చేపట్టినా సరే వారిని అంతం చేయలేని కేంద్రం.. ఆపరేషన్ కగార్ తో మాత్రం సక్సెస్ అయింది.

Also Read : పరకామణి కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే..!

ఇక తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్ లలో.. మాడ్వీ హిడ్మా సహా వరుస అగ్ర నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు జరిగిన ఎన్కౌంటర్ లో మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాల తయారీలో అతినిది అందెవేసిన చేయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడపడం మావోలకు కష్టమే. మరో అగ్ర నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి కూడా మరణించారు అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మాత్రం పూర్తిగా ఉద్యమం అంతమైనట్లే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్