Wednesday, August 5, 2026 11:23 AM
Wednesday, August 5, 2026 11:23 AM

భాగ్యశ్రీ తో ఎఫైర్ పై రామ్ క్లారిటీ..!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే, అందులో రామ్ పోతినేని పేరు తప్పకుండా ముందుంటుంది. గతంలో ఆయన ఎంతో మంది హీరోయిన్స్‌తో డేటింగ్ చేశాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చినప్పటికీ, అవన్నీ రూమర్స్‌గానే తేలాయి. తాజాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ భోర్సేతో రామ్ ప్రేమలో ఉన్నాడని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. రామ్–భాగ్యశ్రీ జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్, భాగ్యశ్రీ తో రిలేషన్షిప్ రూమర్ల పై స్పష్టత ఇచ్చాడు.

Also Read : మల్లోజుల మరో సంచలన వీడియో.. చనిపోవద్దు ప్లీజ్..!

“ఈ సినిమాలో ‘నువ్వుంటే చాలే’ పాటను నేనే రాశాను. ఆ పాటను భాగ్యశ్రీని దృష్టిలో పెట్టుకొని రాసానని, మేమిద్దరం ప్రేమలో ఉన్నామంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. ఆ పాటను రాసినప్పుడు సినిమా హీరోయిన్ ఎవరో కూడా ఫిక్స్ కాలేదు. అసలు నాకు ప్రేమ మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఇప్పటి వరకు ఎవరిని చూసినా అలాంటి ఫీలింగ్ కలుగలేదు” అంటూ రామ్ చెప్పాడు. దీంతో రామ్–భాగ్యశ్రీ లవ్ స్టోరీపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు పూర్తిగా చెక్ పడింది. అయితే రామ్ ఇప్పటికే 38 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో, ఆయన వివాహంపై నెటిజెన్స్ కి ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.

Also Read : బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!

ఆంధ్రా కింగ్ తాలూకా విషయానికి వస్తే.. ఈ సినిమాకు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. ఇది ఆయన రెండో సినిమా. ఇందులో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. నిన్న విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో నెటిజెన్లు “ఈసారి రామ్ డెఫినెట్‌గా భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్స్‌తో కాస్త స్ట్రగుల్ అవుతున్న రామ్, ఈ సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా లేదా అనేది బాక్సాఫీస్‌ దగ్గర తేలాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్