ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి వాహనదారులకు అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. తాజాగా వాహనదారులకు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. నో యువర్ వెహికల్ విధానాన్ని సరళీకృతం చేసింది. ఈ మేరకు ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇందులో వినియోగదారులకు నో యువర్ వెహికల్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయడానికి తగినంత సమయం ఇచ్చింది.
Also Read : ఆ విషయంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు..!
అయితే ఈ రూల్ పాటించని వాహనాలకు ఫాస్టాగ్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారికి.. వాహన్ డేటాబేస్ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వివరాలను ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ కు కారు లేదా ఇతర వాహనాల యజమానులు తమ వాహనం ముందు భాగం ఫోటో ఫాస్టాగ్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందుల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : చేవెళ్ళ బస్సు ప్రమాదానికి 9 కారణాలు, మరణాలు అందుకే పెరిగాయా..?
అలాగే నకిలీ వాహనాలను కట్టడి చేసేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గడువు ముగిసిన వాహనాల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు వినియోగదారులు తమకు ఫాస్టాగ్ సేవలు ఇచ్చే బ్యాంకులో సంబంధిత ఇబ్బందులపై 1033 అనే నేషనల్ హైవే హెల్ప్ లైన్ కు కూడా కాల్ చేయవచ్చని తెలిపింది. ఇక బ్యాంకులు దీనికి సంబంధించి వార్నింగ్ మెసేజ్ కూడా పంపాలని.. కేవైవీ పూర్తి చేసుకునే దిశగా సహాయం చేయాలని సూచించింది.

