Tuesday, September 29, 2026 02:44 AM
Tuesday, September 29, 2026 02:44 AM

కల్తీ లిక్కర్ కేసులో.. కొత్త పేరు.. తాడేపల్లి ప్యాలెస్ కు లింకులు..!

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మధ్య వ్యవహారానికి సంబంధించి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులను ప్రత్యేక దర్యాప్తు బృందం టార్గెట్ చేసిన దగ్గర నుంచి, ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారా.. అంటూ రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆదివారం ఉదయం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇబ్రహీంపట్నంలో అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి, ఎవరి పేర్లు బయటికి వస్తాయనే దానిపై కాస్త ఉత్కంఠ నెలకొంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పేరు కూడా ఈ వ్యవహారంలో వినపడటంతో ఆయనను కూడా అధికారులు విచారించారు.

Also Read : ఈనాడు సంచలన హెచ్చరిక.. వారికి ఇబ్బందులే

ఇక ఇదే అంశానికి సంబంధించి తాజాగా మరో పేరు కూడా బయటకు వచ్చింది. కల్తీ లిక్కర్ కేసులో మనోజ్ కొటారి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. గతంలో వైసీపీ కీలక నేతతో మనోజ్ కు మంచి సంబంధాలు ఉండేవి అని వార్తలు వస్తున్నాయి. వైసీపీ కీలక నేత బినామీగా మనోజ్ కొటారి వ్యవహరిస్తున్నాడని, అదే విధంగా కల్తీ లిక్కర్ కేసులో ఏ 20గా ఉన్న మనోజ్ కు, తాడేపల్లి ప్యాలెస్ కు లింకులు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ పెద్దల సహకారంతోనే కల్తీ మధ్యలో అతను కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.

Also Read : ఆ విషయంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు..!

బార్లకు మద్యం సరఫరా చేసే అంశంతో పాటుగా.. కొన్ని వైన్ షాపులకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కల్తీ మద్యాన్ని సరఫరా చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో.. కల్తిమద్యం నగదు వ్యవహారాలు కూడా అతని చూసినట్లు సమాచారం. ఇక మనోజ్ కొఠారి పాత్ర పై ఎక్సైజ్ అలాగే సిట్ సంయుక్తంగా సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టాయి. ఈ కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేసిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. విజయవాడలో కీలక వ్యాపారాలు చేసే మనోజ్.. కొన్ని బార్లలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

పోల్స్