Wednesday, October 14, 2026 04:56 PM
Wednesday, October 14, 2026 04:56 PM

బాబు బాటలో విజయ్‌.. తమిళనాడులో రచ్చ రచ్చ

గోదావరి-కావేరి నదుల అనుసంధానంతోనే దక్షిణాది రాష్ట్రాలకు అసలైన మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు చేతులు కలపాలని చంద్రబాబు ప్రతిపాదించారు. మంగళవారం అమరావతిలోని ఉండవల్లి నివాసంలో తమిళనాడు CM జోసెఫ్ విజయ్‌తో జరిగిన భేటీలో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు. విజయ్‌తో పాటు ఆయన కేబినెట్ సహచరులు, తమిళనాడు CS సాయికుమార్ తదితర ఉన్నతాధికారుల బృందానికి చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.

Also Read : జగన్ కు మ్యూజిక్ స్టార్ట్ అయిందా..?

చెన్నై నగరానికి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సరఫరాను మరింత పెంచాలని కోరేందుకే తమిళనాడు సీఎం బృందం అమరావతికి వచ్చింది. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ నదుల అనుసంధానంపై ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని, దీనివల్ల దక్షిణాది నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో జరిగిన ఒప్పందాలను, NTR-MGR మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని తెలిపారు. రాష్ట్రాల సరిహద్దులు వేరైనా ప్రజల సమస్యల పరిష్కారంలో తమిళనాడుతో ఏపీ ఎప్పుడూ కలిసే ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read : సౌదీ అరామ్‌కోపై హౌతీల మిస్సైల్ దాడి.. భారత్ కు చుక్కలేనా..?

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, చెన్నై తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కండలేరుకు కృష్ణా జలాలు తగినంతగా చేరకపోయినా కూడా మానవతా దృక్పథంతో చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేశామని వివరించారు. తమిళనాడు అధికారులు దీనిపై సందేహం వ్యక్తం చేయగా, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ద్వారా నీటి విడుదల వివరాలను స్పష్టంగా నిరూపించారు. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల వర్షాలను బట్టి మరిన్ని నీటిని అందించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు.

Also Read : ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల సమరం.. అసలు మేటర్ ఏంటీ..?

సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడు సీఎం విజయ్ ఎక్కువ సమయం మౌనంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలను విన్నారు. భేటీ చివర్లో చెన్నై తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా రాసిన లేఖను చంద్రబాబుకు అందజేసి వీడ్కోలు తీసుకున్నారు. ఇకపై చెన్నై నీటి సరఫరా అంశంపై ప్రతి 6 నెలలకోసారి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై సమీక్షించాలని నిర్ణయించారు. ఈ కీలక భేటీలో ఏపీ మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడుతో పాటు ఏపీ CS సాయిప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

కూటమిలో ముదురుతున్న స్థానిక...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్...

వివేకా కేసులో.. వచ్చే...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

పోల్స్