Thursday, July 23, 2026 07:41 PM
Thursday, July 23, 2026 07:41 PM

వెలుగులోకి మరో వైసీపీ నేత భూ దందా.. మరి అరెస్టు ఎప్పుడు..?

నీతి, నిజాయతీ అంటూ మాటలు చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న ఐదేళ్లు చెప్పలేనంత అక్రమాలు చేశారు. అయితే ఐదేళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అరాచకాలతో పాటు వాళ్లు చేసిన అవినీతి, అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువులు వైసీపీ నేతలు చేసిన భూ దందాలు నాటి అరాచక పాలనకు అద్దం పడుతున్నాయి. అధికారులను బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా కబ్జా చేసేశారు.

Also Read : ఆ జిల్లాలో వైసీపీ ఇక కష్టమే..!

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ ఆక్రమణల గురించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. బతికున్నమనిషి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ తయారు చేసి.. లేని వారసురాలని సృష్టించి.. అతనికి చెందిన రూ.4 కోట్ల విలువైన భూములను తన కుమారుడి పేరు మీద ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తమ్మినేని. ఈ విషయం బయటకు రావడంతో.. కుటుంబంతో సహా రాత్రికి రాత్రి పరారయ్యారు. దీంతో పోలీసులు తమ్మినేని కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే.. వైసీపీలో మరో కీలక నేత భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతి మాటలు చెప్పే తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కంచె వార్..!

అధికారంలో ఉన్న సమయంలో అధికారులను బెదిరించిన భూమన కరుణాకర్ రెడ్డి.. కన్ను పడిన భూమి.. నా సొంతం కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను యజమానులను బెదిరించి ఆక్రమించుకున్నారు. తిరుపతి సమీపంలో వంద కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా.. దానికి ఫెన్సింగ్ వేశారంటే.. భూమన బెదిరింపులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పంచాయతీ పరిధిలో రూ.45 కోట్ల విలువైన 9 ఎకరాలు, మంగళం పరిధిలో ఉన్న రూ.50 కోట్ల విలువైన ఏడున్నర ఎకరాల భూమిని భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది.

Also Read : టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన టీటీడీ..!

ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖకు విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు. అయితే భూమన బెదిరింపులతో అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు. అయితే ఈ దందా రుజువులతో బయటకు రావడంతో ప్రభుత్వం పైన, అధికారుల పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. భూమన ఆక్రమణలపై కొరడా ఝుళిపించింది. తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళంతో పాటు చిగురువాడ సమీపంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల్లో భూమన వరి పంట వేసినట్లు గుర్తించిన అధికారులు.. భూమి చుట్టూ భూమన వేసిన కంచె తొలిగించి.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు భూమన పాపం పండిందంటూ స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

భూములైతే స్వాధీనం చేసుకున్నారు కానీ.. కబ్జా చేసిన భూమనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కబ్జాదారులపై చర్యలెప్పుడని తిరుపతి వాసులు ప్రశ్నిస్తున్నారు. ఓ సాధారణ టెలిఫోన్ బూత్ నిర్వహించుకునే స్థాయి నుంచి టీటీడీ ఛైర్మన్ స్థాయికి చేరుకున్న భూమన.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు రుజువవుతున్నా.. అధికారులు, ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తల్లికి వందనం షురూ.....

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి...

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్...

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత,...

యుద్ధం కొనసాగితే 9/11...

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు...

సీజేపీ చీఫ్ అభిజిత్...

నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి...

అమరావతి నిర్మాణంలో కీలక...

నవ్యాంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ...

బండ్ల గణేష్‌ కు...

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల...

పోల్స్