Saturday, May 2, 2026 05:45 PM
Saturday, May 2, 2026 05:45 PM

రెండేళ్ల తర్వాత కూడా అంతా మా వల్లే.. ఏం డబ్బా రా..!

డబ్బా రేకుల సుబ్బారాయుడు.. అని చిన్నప్పుడు సరదాగా మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఈ మాట వైసీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. కూటమి సర్కార్ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని పదే పదే చెబుతున్న వైసీపీ నేతలు.. తమది మాత్రం చోరీ కాదంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అయినా సరే.. కూటమి సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ మంచి పని చేసినా సరే.. అది ఐదేళ్ల జగన్ పాలన వల్లే అనే డబ్బు కొట్టుకుంటున్నారు. అంటే రెండేళ్లల్లో కూటమి సర్కార్ ఏమీ చేయలేదని పరోక్షంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్లు చేసుకుంటున్న తప్పుడు ప్రచారం.. తిరిగి వాళ్లకే బూమ్ రాంగ్ అవుతుంది.

Also Read : పెట్రో బాదుడుకు రంగం సిద్ధం..!

పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. 600 మార్కులకు ఏకంగా 596 మార్కుల వరకు విద్యార్థులు సాధించారు. దీంతో “సగర్వంగా నిల ‘బడి’..” అనే పేరుతో అన్ని పత్రికల్లో ఫుల్ ఫేజ్ యాడ్ ఇచ్చింది ఏపీ విద్యా శాఖ. ఈ యాడ్‌లో విద్యార్థుల ఫోటోలను ప్రచురించారు. ఈ యాడ్ పట్ల ఇప్పుడు ఏపీలో ఎంతో మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివామని.. ఇలా చూడటం ఎంతో గర్వంగా ఉందంటున్నారు. ఇక కొందరు టీచర్లు అయితే వీడియోలు చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అంతా కితాబిస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు సీసీడీ జబ్బుతో బాధపడుతున్నారని మరోసారి రుజువు చేశారు. క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఇటీవల మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నిజమే అనేలా ఇప్పుడు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలకు జగన్ మాత్రమే కారణమని గొప్పలు చెప్పుకుంటున్నారు. “ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులకు కర్త, కర్మ, క్రియ ఒకరే, అది వైయస్ జగన్ గారే. 2026లో 10వ తరగతి విద్యార్థుల చేతుల్లో 2 ఏళ్ళ క్రితం ట్యాబ్‌లు పెట్టింది జగన్ ప్రభుత్వం. డిజిటల్ బోర్డులు, IFP ప్యానెల్స్, ఇంగ్లిష్ మీడియం, BYJU’S వంటి ఆధునిక విద్యా మార్పులు తీసుకొచ్చింది జగన్ గారే. అయితే ఇవన్నీ ఎప్పుడో వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన, జగన్ గారి విద్యార్థులకు వచ్చిన ఫలితాలపై ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి పరుగులు తీస్తున్నాడు మన లోకేష్ బాబు. జగన్ గారు వేసిన బలమైన పునాదుల వల్లే ఈరోజు ఫలితాలు వస్తున్నాయి, ఇది వాస్తవం. క్రెడిట్ దొంగిలించడం కాదు, కనీసం ఉన్న వ్యవస్థను కొనసాగించడం నేర్చుకుంటే మంచిది.” అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సహా పలువురు వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు.

Also Read : గ్లాడియేటర్స్ డాక్యుమెంటరీ.. అజిత్‌ రేసింగ్‌ లైఫ్..!

అయితే టీడీపీ నేతలు, అభిమానులతో పాటు ఉపాధ్యయులు, ఏపీ ప్రజలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. అసలు బైజూస్ ఇంకా ఉందా.. అని ప్రశ్నిస్తున్నారు. బైజూస్ చేసిన మోసం గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లతో వాళ్లు అప్పట్లో గేమ్ ఆడుకుంటున్న వీడియోలను ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. జగన్ ఏలుబడిలో నాసిరకం బ్యాగులు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు. ఇక కరోనా సమయంలో చదువు చెప్పాల్సిన ఉపాధ్యయులకు వైన్ షాపుల ముందు డ్యూటీలు చేయమని చెప్పింది కూడా జగన్ ఏలుబడిలోనే అని కౌంటర్ ఇస్తున్నారు. అన్ని పథకాలకు జగన్ పేరు పెట్టుకున్నారు తప్ప.. చేసిన ఒక్క మంచి పని చెప్పగలరా అని నిలదీస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ సీదిరి అప్పల్రాజు కూడా పదవ తరగతి పరీక్షల్లో స్టేట్ 4వ ర్యాంకు తెచ్చుకుని.. చంద్రబాబు చేతుల మీదుగానే రివార్డు అందుకున్న విషయం గుర్తు చేశారు. ఆయనకు రివార్డు 1999లోనే వచ్చిందని.. అప్పుడు కూడా జగన్ సీఎం అని చెబుతారా ఏమిటీ.. అని కౌంటర్ ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

పోల్స్