Saturday, May 2, 2026 05:09 PM
Saturday, May 2, 2026 05:09 PM

పెట్రో బాదుడుకు రంగం సిద్ధం..!

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే దిశగా వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు, క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో, దేశీయంగా ఇంధన ధరలను సవరించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. తాజా సమాచారం ప్రకారం, త్వరలోనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం మెండుగా ఉంది.

Also Read : బ్రేకింగ్: డిప్యూటి సీఎం పవన్‌ ఇంటికి చంద్రబాబు..!

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పవచ్చు. ధరల పెంపునకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను గమనిస్తే, సామాన్యుడి వంటగదిపై ఈ భారం గట్టిగానే పడబోతోంది. గృహ వినియోగ సిలిండర్‌పై సుమారు రూ. 50 వరకు పెంచేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రవాణా రంగానికి జీవనాధారమైన పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

Also Read : కల్కి 2898 ఏడీ సీక్వెల్ షురూ.. మే 4 నుంచే ప్రభాస్ ఎంట్రీ..!

యుద్ధం నేపథ్యంలో ముడిచమురు దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల ఈ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే దీనిపై లెక్కలు పూర్తి చేశాయని, ఏ క్షణంలోనైనా ఈ పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే కాకుండా, పరోక్షంగా ప్రతి సామాన్యుడిపై ప్రభావం చూపుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు భారమై, తద్వారా కూరగాయలు, పప్పులు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

పోల్స్