Thursday, September 17, 2026 08:07 PM
Thursday, September 17, 2026 08:07 PM

ఏఐఎస్ అంటే ఏంటీ..? హార్మోజ్ లో భారత నౌక ఆ సిస్టంను ఎందుకు ఆపేసింది..?

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో.. భారత్ కు చమురు రవాణా అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు సౌదీలో బయల్దేరిన లైబీరియా నౌక భారత్ లోని ముంబైకి చేరుకుంది. ఈ టైంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నౌక భారత్ కు చేరింది. ఈ నేపధ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఈ నౌక బయల్దేరినప్పుడు ఏఐఎస్ ను ఆపేసింది. అంటే.. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్.. ఇది ఓడలకు ఉండే ఒక రకమైన ‘డిజిటల్ గుర్తింపు కార్డు’ అలాగే ‘లైవ్ లొకేషన్ ట్రాకర్’ లాంటిది.

Also Read : ఏపీ అభివృద్ధికి అడ్డుగోడ వైఎస్ జగన్

వీహెచ్ఎఫ్ రేడియో తరంగాల ద్వారా ఓడ పేరు, దాని మోడల్, ఖచ్చితమైన స్థానం, వేగం, అది ఏ దిశలో వెళుతుందో నిరంతరం ఇతర నౌకలకు, తీర ప్రాంతాల్లోని కంట్రోల్ రూమ్‌ లకు తెలియజేస్తుంది. సముద్రంపై ప్రయాణించే నౌకలు ఒకదానికొకటి ఢీకొనకుండా ఉండటానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పెద్ద నౌకలన్నీ దీన్ని తప్పనిసరిగా వాడాలి. అయితే ఈ సిస్టంను భారత నౌక ఆపేసింది. మార్చి 2026లో సౌదీ అరేబియా నుండి ముడి చమురుతో వస్తున్న ‘షెన్‌లాంగ్’ అనే భారీ చమురు ట్యాంకర్, హార్మోజ్ జలసంధిని దాటే సమయంలో తన ఏఐఎస్ సిస్టం ను ఆపేసింది.

Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

దీనినే మెరైన్ భాషలో “గోయింగ్ డార్క్” అంటారు. దీనికి గల కారణాలు చూస్తే, ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఏఐఎస్ ఆన్ చేసి ఉంటే శత్రువుల డ్రోన్లకు లేదా క్షిపణులకు నౌక ఎక్కడ ఉందో సులభంగా తెలిసిపోతుంది. గుర్తింపును దాచిపెట్టి సురక్షితంగా వెళ్లడానికి కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ను తప్పుదోవ పట్టించే చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల తప్పుడు సమాచారం ప్రసారమయ్యే ప్రమాదం ఉన్నందున రక్షణ దృష్ట్యా సిస్టమ్ ఆపేయడం ఉత్తమమని భావించారు. హార్మోజ్ ఇక్కడ ‘సైలెంట్ మోడ్’లో ప్రయాణించడం వల్ల దాడుల ముప్పు తగ్గుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్