Thursday, September 17, 2026 08:06 PM
Thursday, September 17, 2026 08:06 PM

పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

“వరుసగా రెండవ సారి టి20 వరల్డ్ కప్ భారత్ గెలిచింది.. భారత ఆటగాళ్ళు సంబరాలలో మునిగితేలారు.. దేశం మొత్తం ఆటగాళ్లను చూసి గర్వించింది” ఇక్కడి వరకు బాగానే ఉంది గాని.. గెలిచిన తర్వాత ఓ ఆటగాడి సంబరాలే ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. అతనే టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ జస్ప్రిత్ బూమ్రా. అహ్మదాబాద్‌ లో టీ20 ప్రపంచ కప్ విజయోత్సవాల సందర్భంగా అతని సంతోషం హద్దులు దాటింది అనే విమర్శలు వస్తున్నాయి. వేదికపైనే గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఉండటంపై విమర్శలు వచ్చాయి.

Also read : బాలీవుడ్ ఓ చెత్త అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్

ఇక ఇప్పుడు జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో హార్దిక్ పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఒక న్యాయవాది పూణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో.. బుధవారం ఫిర్యాదు చేసారు వాజిద్ ఖాన్. విజయం అనంతరం.. పాండ్యా తన శరీరం చుట్టూ త్రివర్ణ పతాకాన్ని చుట్టుకుని మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య సంబంధిత చట్టం ప్రకారం నేరం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జాతీయ జెండా గౌరవాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also read : టి20 లకు బూమ్రా గుడ్ బై..?

అటు హార్దిక్ పాండ్యా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా మైదానంలో తోటి ఆటగాళ్ళ విషయంలో కూడా అతని వైఖరి వివాదాస్పదంగా ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కాగా 2024 లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా పాండ్యా సభ్యుడు కావడం విశేషం. మొత్తం నలుగురు ఆటగాళ్ళలో అతను కూడా ఒకడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్