Thursday, September 17, 2026 08:51 PM
Thursday, September 17, 2026 08:51 PM

టి20 లకు బూమ్రా గుడ్ బై..?

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీం యాజమాన్యం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో భారత జట్టు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వన్డేల్లో బౌలింగ్ విభాగం మరింత బలహీనంగా కనబడుతోంది. కీలక బౌలర్లు జట్టుకు దూరమైన తర్వాత, బూమ్రా నాయకత్వంలో టీమిండియా బౌలింగ్ విభాగం ముందుకు నడుస్తోంది. అయితే ఇప్పుడు క్రమంగా పట్టు కోల్పోయింది బౌలింగ్ విభాగం. ఇటీవల కాలంలో వన్డేల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు.

Also Read : ఇరాన్ ఆయిల్ కు “గోల్డ్ లిక్విడ్” అనే బిరుదు ఎందుకు..?

ముఖ్యంగా కలకత్తా నైట్ రైడర్స్ లో ఉన్న కొంత మంది ఆటగాళ్లను, జట్టులోకి తీసుకురావడంపై కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం కొన్ని కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని, జట్టులో కీలక బౌలర్ గా భావిస్తున్న బూమ్రాను టి20 లో ఆడించకుండా వన్డేలలోనే ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ వరకు టీమిండియా 35 వన్డేలు ఆడుతుంది. అప్పటివరకు కూడా బూమ్రాను వన్డేలకే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read : పెంచలయ్య సరే.. మరి.. రవి సంగతి ఏమిటీ..?

ఫిట్నెస్ పరంగా అతని విషయంలో కాస్త ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్, ఒలంపిక్స్ లో కూడా బూమ్రాను ఆడించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టి20ల లో ఎక్కువగా ఆడితే అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. అలాగే టెస్టులకు కూడా అవసరం అయితే దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసే సమయానికి వచ్చే వరల్డ్ కప్ కోసం ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ చేసి ఆలోచనలో జట్టు యాజమాన్యం కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్