Friday, June 19, 2026 09:41 AM
Friday, June 19, 2026 09:41 AM

మలబద్దకానికి జుట్టు రాలడానికి లింక్ ఉందా..?

జుట్టు రాలడం అనేది చాలా మందికి మానసిక సమస్య. జుట్టు కోసం ఎంతో కష్టపడే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో పురుషులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘జుట్టు రాలడం’. ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, పురుషుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం. అయితే, జుట్టు రాలడానికి మనం వాడే షాంపూలు లేదా నూనెలు మాత్రమే కారణం కాదని, మన శరీరంలోని అంతర్గత వ్యవస్థే దీనికి ప్రధాన కారణమని ట్రయా హెల్త్ ఇటీవల తమ పరిశోధనల్లో బయటపెట్టింది.

Also Read : లోకేష్ సీఎం.. ముహూర్తం ఫిక్స్..!

ట్రయా హెల్త్ తాజాగా 1.6 లక్షల మంది భారత పురుషుల హెల్త్ డేటాను డిసెంబర్ 2024 నుండి డిసెంబర్ 2025 వరకు విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం, మలబద్ధకం, పేగు ఆరోగ్యం బలహీనపడటం, నేరుగా జుట్టు రాలడంతో ముడిపడి ఉన్నాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందక జుట్టు పల్చబడటం ప్రారంభమవుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. తెలంగాణలోనే అత్యధిక ప్రభావం ఉన్నట్లుగా తేల్చారు. ఈ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న కేటిఆర్..?

దేశవ్యాప్తంగా 10 ప్రధాన రాష్ట్రాలలో ఈ అధ్యయనం చేయగా.. తెలంగాణ పురుషులలో పేగు ఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తోంది. పేగు ఆరోగ్యం బాగున్న వారి సంఖ్య 4.10% తగ్గిందట. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ప్రతికూల మార్పులు కనిపించాయి. కేవలం తలపై రాసే మందుల కంటే, లోపల ఉన్న జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారానే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు రాలితే కొత్త జుట్టు కోసం కంటే.. సరైన ఆహారం మీద దృష్టి పెట్టాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్