Friday, May 1, 2026 10:02 AM
Friday, May 1, 2026 10:02 AM

హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న సింగర్ కాలభైరవ

సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సరిగ్గా పది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో ఇచ్చిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు విజయ్, రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. ఆ తర్వాత మరో నటుడు అల్లు శిరీష్ వివాహం నయనికతో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి, పవన్, సూర్య సహా పలువురు ప్రముఖులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కాబోయే సతీమణి కావ్యాను అభిమానులకు పరిచయం చేశాడు. కొద్దిమంది ప్రముఖుల మధ్యలో నిర్వహించిన రోకా వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : పవన్ మాట వినరేం..? ఇంకెన్నాళ్ళు ఈ జాగు..!

తాజాగా మరో జంటకు సంబంధించిన పుకార్లు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. కలర్ ఫోటో సినిమా సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి, ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫోటో సినిమాలో సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించగా.. కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచే కాల భైరవ, చాందినీ చౌదరి ప్రేమలో ఉన్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Also Read : తిరువూరుకు కొత్త బాస్.. తెరపైకి కొత్త పేరు..!

అయితే ​వారు కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని కొందరు అంటుంటే, మరికొందరు వారు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బలంగా చెబుతున్నారు. ​ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కాలభైరవ సోదరుడు, నటుడు శ్రీ సింహా వివాహం నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో జరిగింది. ఈ జంటది కూడా ప్రేమ వివాహం. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పెళ్లి సందడిలో రాజమౌళి, కీరవాణి కుటుంబాలు, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రాజమౌళి సంతోషంగా డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా కాలభైరవ, చాందినీ చౌదరి జంట కూడా పెళ్లి పీటలెక్కనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్