Tuesday, November 3, 2026 11:40 AM
Tuesday, November 3, 2026 11:40 AM

విజయ్ దళపతికి అమెజాన్ బిగ్ షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రస్తుతం తన సినిమా కెరీర్‌ కు వీడ్కోలు పలుకుతూ రాజకీయాల్లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటైన ‘జననాయగన్’ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. ముఖ్యంగా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఒప్పందం నుండి తప్పుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘జననాయగన్’ డిజిటల్ హక్కులను సుమారు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read : ఏపీ అభివృద్ధికి అడ్డుగోడ వైఎస్ జగన్

ఒక ప్రాంతీయ సినిమాకు, అది కూడా కేవలం ఒకే ప్లాట్‌ఫారమ్ కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే, ఈ ఒప్పందం వెనుక కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. ఒప్పందం రద్దుకు ప్రధాన కారణాలు చూస్తే.. సినిమా థియేటర్లలో విడుదలైన నిర్ణీత గడువు సాధారణంగా 4 వారాలు లేదా 8 వారాలు తర్వాతే ఓటీటీలోకి రావాలి. అయితే ‘జననాయగన్’ సినిమా నిర్మాణంలో జరిగిన జాప్యం వల్ల, సమయానికి సెన్సార్ ప్రక్రియ పూర్తి కాలేదు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకపోవడంతో, అమెజాన్ ప్రైమ్ తన స్ట్రీమింగ్ క్యాలెండర్‌ ను సర్దుబాటు చేయలేకపోయింది.

Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

ఒప్పందం ప్రకారం నిర్ణీత తేదీలోపు సినిమా తమకు అందుబాటులోకి రాకపోవడంతో ఆ సంస్థ లీగల్‌గా వెనక్కి తగ్గింది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడంతో, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం కావచ్చని, సెన్సార్ బోర్డు నుంచి మరిన్ని అభ్యంతరాలు రావచ్చని అమెజాన్ ముందే ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే, ఇతర ఓటీటీ సంస్థలు నెట్‌ ఫ్లిక్స్ లేదా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ ను సంప్రదించే అవకాశం ఉంది. కానీ, అమెజాన్ ఆఫర్ చేసినంత భారీ మొత్తాన్ని మరే ఇతర సంస్థ ఇస్తుందా అన్నది సందేహమే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్లీ యాత్రల సమయం.....

"మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఎవరెన్ని యాత్రలు...

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

పోల్స్