Saturday, May 9, 2026 07:03 PM
Saturday, May 9, 2026 07:03 PM

మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేత కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా కూడా తట్టుకుని టెక్కలిలో అచ్చెన్నాయుడు విజయం సాధించారు. ఇక అచ్చెన్నను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో.. వరుస కేసులతో జైలు పాలయ్యారు. దీంతో బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న అచ్చెన్నాయుడును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు అచ్చెన్నాయుడు. తాజాగా పార్టీ పొలిట్‌బ్యూరోగా అచ్చెన్నాయుడును నియమించగా.. ఆయన అన్న కుమారుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.

Also Read : వాసు డిమాండ్ వెనుక మతలబు ఏమిటో..!

టెక్కలిలో కింజరాపు కుటుంబానికి తిరుగులేదు అన్నట్లుగా పరిస్థితిని మార్చుకున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది కూడా కింజరాపు కుటుంబం. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నిమ్మాడ కింజరాపు సొంత ఊరు. ఇప్పటికీ ఆ ఊర్లోనే ఆయన కుటుంబం నివసిస్తోంది. అలాగే జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా అచ్చెన్నాయుడు తప్పనిసరిగా టెక్కలిలోని కార్యాలయానికి వెళ్లి నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అలాగే నియోజకవర్గం సమస్యలపై అధికారులతో చర్చిస్తారు కూడా. అయితే తాజాగా ఓ ఘటనతో అచ్చెన్నాయుడు పరువు నిలువునా పోయినట్లు అయ్యింది.

టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కనీసం బాత్రూమ్‌కు వెళ్లేందుకు కూడా నీరు లేకుండా పోయింది. దీంతో రోగులు, వారి బంధువులు.. ఆసుపత్రికి స్వయంగా బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. ఇక రాత్రి పూట ఆ బకెట్లలో నీరు ఎవరు తీసుకోకుండా కాపలా కూడా కాస్తున్నారు. ఇక చిన్న పిల్లలు ఉన్న వార్డులో అయితే పరిస్థితి దారుణంగా మారిపోయింది. నీరు లేకపోవడంతో బాత్రూమ్‌ల వద్ద దుర్వాసన వస్తోంది. దీంతో రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?

విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. టెక్కలి ఏరియా ఆసుపత్రిలో తీవ్రనీటి కొరత, బాత్రూముల్లో తీవ్ర దుర్వాసన, రోగుల పాట్లు, ఆసుపత్రి దుస్థితి కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారు. నీటి కొరత వల్ల ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడంలేదని వైసీపీ టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. జిల్లా ఆసుపత్రిని తిలక్ సందర్శించి రోగులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం అభివృద్ధి అంటూ గొంతు చించుకుంటున్న స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు ఆసుపత్రి పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరాడ తిలక్.. తన సొంత నిధులతో మంచి నీటి ట్యాకర్‌ను ఆసుపత్రికి పంపారు. రోగులు నెల రోజులుగా నీరు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నిర్లక్ష్యం వల్లే రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పార్టీ నేత ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయడం సిగ్గు చేటనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. వరుసగా 3 సార్లు గెలిపించిన టెక్కలి ప్రజలకు మీరు ఇచ్చిన బహుమానం సూపర్ అంటూ అచ్చెన్నాయుడును టార్గెట్ చేస్తున్నారు. ఇక కొందరైతే.. కనీసం నీరు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలను అచ్చెన్నాయుడు గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు ట్యాంకర్ల ద్వారా ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గ కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రికి నీరు సరఫరా చేయడంతో.. మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా అనే ప్రచారం బాగా జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆపరేషన్ ఆకర్ష్.. మోదీ...

బెంగాల్‌పై ఫోకస్ చేసి మరీ కొట్టారు....

జగన్ స్కెచ్ వర్కవుట్...

2029లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత,...

అసలు విజయ్ చుట్టూ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్...

సీఎం సచివాలయంలో ఉండగా.....

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద...

ఏపీలో ఇక 24...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు...

బీజేపీలోకి కొడాలి నాని.....

కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి...

పోల్స్