Wednesday, August 12, 2026 10:29 AM
Wednesday, August 12, 2026 10:29 AM

ఐఫోన్ చిప్స్ ఇక ఇంటెల్ మేకింగ్..?

టెక్ ప్రపంచంలో ఒక భారీ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. తన సొంత చిప్‌ల తయారీ కోసం ఇప్పటివరకు తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీపైనే ఎక్కువగా ఆధారపడుతున్న ఆపిల్, ఇప్పుడు అమెరికన్ చిప్ దిగ్గజం ఇంటెల్ వైపు మొగ్గు చూపుతోంది. ఐఫోన్ మరియు ఇతర ఆపిల్ పరికరాల కోసం చిప్‌ లను తయారు చేసేందుకు ఇంటెల్‌ తో ఆపిల్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఆపిల్ కంప్యూటర్లకు ఇంటెల్ ప్రధాన చిప్ సరఫరాదారుగా ఉండేది.

Also Read : సీఎం సచివాలయంలో ఉండగా.. భయపెట్టిన ప్రచారం..!

అయితే, ఆపిల్ తన సొంత ఎం.. సిరీస్ చిప్‌ లను అభివృద్ధి చేయడం ప్రారంభించిన తర్వాత వీరి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఐఫోన్ చిప్‌ ల తయారీ కోసం ఇంటెల్ ఫౌండ్రీ సేవలను వాడుకోవాలని ఆపిల్ నిర్ణయించుకోవడం టెక్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఆపిల్ చిప్‌ల తయారీలో టీఎస్ఎంసి ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయిస్తోంది. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సప్లై చైన్ సమస్యల దృష్ట్యా, ఒకే కంపెనీపై ఆధారపడటం ప్రమాదకరమని ఆపిల్ భావిస్తోంది.

Also Read : 2028 నుంచి ఐపీఎల్‌లో భారీ మార్పులు..!

ఇంటెల్‌ తో జతకట్టడం ద్వారా.. ఆపిల్ తన చిప్ సరఫరాను మరింత సురక్షితం చేసుకుంటుంది. అలాగే అమెరికాలోనే చిప్‌ ల తయారీ పెరగడం వల్ల రవాణా ఖర్చులు, సమయం తగ్గుతాయి. చిప్ తయారీ రంగంలో పోటీ పెరిగి, ఆపిల్‌ కు మంచి ధరలు లభించే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా చిప్ తయారీ రంగంలో వెనుకబడిన ఇంటెల్‌కు, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థ ఆర్డర్ దక్కడం ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. ఇంటెల్ యొక్క సరికొత్త 18ఏ ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా ఈ చిప్‌ లను తయారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందం ఖరారైతే, భవిష్యత్తులో వచ్చే ఐఫోన్ మోడల్స్ మరియు మ్యాక్ బుక్స్‌లో ఇంటెల్ తయారీ చిప్‌లను మనం చూడవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్