Thursday, July 23, 2026 08:22 PM
Thursday, July 23, 2026 08:22 PM

దేశంలో విశాఖ టాప్‌.. కుప్పలుగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం.. అభివృద్దిలోనూ సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకుపోతోంది. మన దేశంలో వేగంగా డెవలప్‌ అవుతున్న నాన్ మెట్రో సిటీస్‌లో వైజాగ్ టాప్‌ ప్లేస్ నిలబెట్టుకొంది. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డ్‌ఇన్‌ రిపోర్టులో.. మన స్టీల్‌ సిటీకి తిరుగులేదని తేలింది. విశాఖ తర్వాత స్థానాల్లో లుధియానా, సూరత్‌, వడోదరా, ప్రయాగ్‌రాజ్‌ వంటి నగరాలు ఉన్నాయి.

Also Read : వెలుగులోకి మరో వైసీపీ నేత భూ దందా.. మరి అరెస్టు ఎప్పుడు..?

ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లతో టెక్నాలజీ రంగంలో వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు.. ఫైనాన్షియల్‌ సర్వీసెస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్‌ రంగాల్లోనూ వైజాగ్‌ దూసుకుపోతోంది. ఈ సెక్టార్లలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కారణాలతో జాబ్‌ క్రియేషన్‌లో విశాఖపట్నం.. దేశంలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఏఐ ప్రభావంతో ఐటీ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతున్న సమయంలో.. కొత్త జాబ్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది.

Also Read : జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్ కు రంగం సిద్దం..?

ఎక్కడ అవకాశాలు దొరికితే యువత అక్కడ వాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్‌ వంటి నగరాలు యువతకు కెరీర్ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు విశాఖలో స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ప్లాన్‌ ప్రకారమే ఐటీ, ఏఐ, టూరిజం, ఏరో స్పేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Also Read : రా ఎన్టీఆర్ వివాదం.. సేవ వెనుక అసలు కథేంటి..?

గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్‌ ప్లాంట్‌, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ఐటీ, ఇన్‌ఫ్రా, తయారీ రంగ ప్రాజెక్టులతో వైజాగ్‌ కొత్త అవకాశాలకు కేంద్రంగా మారింది. ఇప్పటి వరకు స్థానిక యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ రానున్న కాలంలో.. ఉత్తరాంధ్రతో పాటు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల యువత ఉద్యోగాల వేటలో.. విశాఖ ఫస్ట్‌ ఆప్షన్‌గా మారుతుంది. అందుకే విశాఖకి‌ దేశంలోనే ఫాస్టెట్‌ గ్రోయింగ్ సిటీ ట్యాగ్‌ దక్కింది. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉంటే.. యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆ తర్వాత ర్యాంకులు, రివార్డులు వాటంతట అవే వస్తాయి. రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం రాసిన పరీక్షలో.. ఆల్‌ ఇండియా నెంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిందని చెప్పొచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తల్లికి వందనం షురూ.....

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి...

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్...

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత,...

యుద్ధం కొనసాగితే 9/11...

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు...

సీజేపీ చీఫ్ అభిజిత్...

నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి...

వెలుగులోకి మరో వైసీపీ...

నీతి, నిజాయతీ అంటూ మాటలు చెప్పే...

అమరావతి నిర్మాణంలో కీలక...

నవ్యాంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ...

పోల్స్