Sunday, September 13, 2026 08:21 PM
Sunday, September 13, 2026 08:21 PM

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్ కు రంగం సిద్దం..?

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అరెస్ట్ దిశగా అడుగులు పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. దళిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శేషయ్యపై ఆయన చేసిన అనుచిత మరియు కుల దూషణల వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిని సమాజంలో తక్కువ చేసి మాట్లాడారంటూ దళిత సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం అధికారికంగా మలుపు తిరిగింది.

Also Read : సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు..!

ఈ ఘటన తీవ్రతను గమనించిన ఎస్సీ కమిషన్ వెంటనే రంగంలోకి దిగి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ క్రమంలోనే కర్నూలు పోలీసులు జక్కంపూడి రాజాపై భారతీయ న్యాయ సంహిత లోని 351(2) సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నాన్-బైలబుల్ కేసులను నమోదు చేశారు. దీంతో ఈ కేసు కేవలం వివాదంగా కాకుండా లీగల్ ఇష్యూగా మారింది. కేసు విచారణలో భాగంగా కర్నూలుకు చెందిన పోలీస్ బృందం నేరుగా రాజమహేంద్రవరంలోని జక్కంపూడి నివాసానికి చేరుకుని ఆయనకు నోటీసులు అందజేసింది.

Also Read : బండ్ల గణేష్‌ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

ఈ నెల 28వ తేదీన దర్యాప్తు అధికారి ఎదుట స్వయంగా హాజరై, సదరు వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక సీనియర్ దళిత అధికారిని టార్గెట్ చేయడం వల్ల నమోదైన ఈ కేసు ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా నిలిచింది. అయితే ఈ కేసులో అట్రాసిటీ చట్టంలోని కఠిన నిబంధనలు ఉండటం వల్ల జక్కంపూడి రాజాకు ఏ క్షణమైనా అరెస్ట్ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఒకవేళ 28న జరిగే విచారణకు ఆయన గైర్హాజరైనా, లేదా పోలీసులు అడిగే ప్రశ్నలకు సరైన ఆధారాలు చూపించలేకపోయినా స్పాట్‌ లోనే ఆయన్ను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్