Wednesday, September 23, 2026 03:52 PM
Wednesday, September 23, 2026 03:52 PM

బ్రేకింగ్: నేడే విజయ్ ప్రమాణ స్వీకారం..!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, తమిళగ వెట్రి కళగం అధినేత, దళపతి విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఉదయం ఆయన రెండోసారి గవర్నర్‌ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, తనకు ఉన్న మద్దతుపై విజయ్ గవర్నర్‌కు ప్రాథమిక సమాచారం అందించారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో, విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Also Read : బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

అయితే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ కు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటించడం విజయ్‌ కు పెద్ద ఊరటనిచ్చింది. మిగిలిన 5 స్థానాల కోసం స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. సంపూర్ణ మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్ గవర్నర్‌ ను రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం. తొలుత మే 7వ తేదీనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి.

Also Read : సంక్షోభంలో ముంబై ఇండియన్స్.. కెప్టెన్సీపై యాజమాన్యం కీలక నిర్ణయం..!

కానీ, సాంకేతిక కారణాలతో వాయిదా పడే అవకాశం ఉందని అందరూ భావించారు. నేడు గవర్నర్ కు పత్రాలను సమర్పించిన నేపధ్యంలో.. ఆయన ప్రమాణ స్వీకారం ఖాయం అయింది. రాజకీయాల్లోకి రాకముందే ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన విజయ్, ఇప్పుడు అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే తన మార్కును చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు తనకు అందాల్సిన అధికారిక పోలీసు కాన్వాయ్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. సామాన్యుడిలాగే ప్రజల మధ్య ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్