Saturday, April 25, 2026 08:01 PM
Saturday, April 25, 2026 08:01 PM

అయ్యా వడ్డే గారు.. ఇక రెస్ట్ తీసుకోండి ప్లీజ్..!

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ నాయకుడైనా టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇటీవల చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంతే కాకుండా వైఎస్ కుటుంబ నామస్మరణలో బిజీ బిజీగా ఉంటున్నారు. తనకు ఐదేళ్లు మంత్రి పదవిచ్చి గౌరవించిన సీఎం చంద్రబాబు పై కావాలని ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వయసు పైబడిన తర్వాత మైండ్ పోయిందేమో.. అందుకే ఏదేదో, ఏమేమో మాట్లాడుతున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు, మంత్రి పదవిచ్చిన చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు.

Also Read : నాడు, నేడు.. కుర్రాళ్లకు సవాల్ విసురుతున్న కోహ్లీ..!

రైతు నాయకునిగా పేరున్న వడ్డే.. వైఎస్‌ కుటుంబం పై ప్రశంసలు కురిపించటం ఏమిటి..? ఐదేళ్లు మంత్రి పదవిచ్చిన సీఎం చంద్రబాబు పై విమర్శలు, ఆరోపణలు చేయటం ఏమిటి..? మతి చలించిందా..? లేక మతిపోయిందేమో..! అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన అమ్ముడుపోయారేమో అని టీడీపీ నేతల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. తాజాగా టీడీపీ అభిమానులు రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “అయ్యా వడ్డే గారూ.. మీలాంటి రాజకీయ నాయకుల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి లేక నాశనమైపోయాయి. మీరు ఓఆర్ఆర్ అంటున్నది విజయవాడ, గుంటూరు నగరాలకు వేస్తున్న కొత్త బైపాస్ అని అనుకోవాలి. “మొన్ననే విజయవాడకి బైపాస్ వేశారు కదా?” అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ బైపాస్ వేయడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. అది పూర్తయ్యే సరికి ఊరు బైపాస్‌ని దాటి వెళ్లిపోయింది. అదే బైపాస్ ఇప్పుడు అమరావతి మధ్యలో నుంచి వెళ్తోంది.

ఇప్పుడు కొత్తగా వేయనున్న బైపాస్‌ను ఇబ్రాహీంపట్నం కొండలు దాటి వేయాలి. అంటే దాదాపు కంచికచర్ల దగ్గరగా విజయవాడకి బైపాస్ రావాలి. అక్కడ క్రాస్ అయినప్పుడు అది గుంటూరుకి కూడా బైపాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వేయబోయే మీరు చెప్తున్న ఓఆర్ఆర్ అనేది విజయవాడ, గుంటూరుకి పశ్చిమ బైపాస్ అవుతుంది. మరి తూర్పు వైపున రోడ్డు ఎందుకంటే మచిలీపట్నం పోర్టు తయారవుతోంది. ఇంకో ఏడాదిన్నరలో పూర్తవుతుంది. మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్, అటు కోల్‌కతా, చెన్నై హైవేకు వెళ్లాలన్నావిజయవాడలో నుంచి వెళ్లాల్సి వస్తుంది. అందుకని దాన్ని హైవేకు కనెక్ట్ చేయాలి. అలా చేస్తే అది విజయవాడ, గుంటూరుకి తూర్పు బైపాస్ అవుతుంది.

Also Read : దుర్గగుడిలో అధికారుల పాపాలు.. ఎందుకీ వరుస వివాదాలు..?

ఇది మొత్తం కలిపితే ఒక రింగ్‌లా ఏర్పడుతుంది.. దాన్నే ఓఆర్ఆర్ అంటున్నారు. ఓఆర్ఆర్ అనేది ఒక స్పష్టమైన ఉద్దేశంతో వేస్తున్నారు. విజయవాడ, గుంటూరుకి బైపాస్ అవసరం ఉంది. అలాగే విజయవాడ – గుంటూరు మధ్యలో వేగంగా పెరుగుతున్న ప్రాంతానికి కూడా బైపాస్ అవసరం ఉంది. అడ్డుకోవటమే పోరాటం అనుకునే మైండ్‌సెట్ నుంచి మీరు అర్జెంట్‌గా బయటికి రావాలి. మా సలహా ఏమిటంటే.. రిటైర్ అయిపోండి సార్. మేమున్నాం కదా.. మా ప్రాంతం కోసం మేమే పోరాడుతాం. మీరు కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోండి సార్..” అంటూ ఘాటుగా రాసిన లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. 80 ఏళ్ల వయసులో ఇలా బయటకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

కల్తీ నెయ్యి కేసు.....

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు...

బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర...

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ...

మంగ్లీ అండ్ టీమ్...

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు,...

పోల్స్