సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కోరుకున్న అద్భుతం జరిగింది. గాయం కారణంగా గత ఏడు మ్యాచ్ లకు దూరమైన జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ సీజన్ కీలక దశకు చేరుకున్న తరుణంలో కమిన్స్ రాక హైదరాబాద్ జట్టుకు కేవలం ఒక ప్లేయర్ రాక మాత్రమే కాదు, అది ఒక పెద్ద బలం అంటున్నారు ఫ్యాన్స్. తదుపరి మ్యాచ్ లలో హైదరాబాద్ కు అతని రాక మరింత బలం చేకూర్చే అవకాశం కనపడుతోంది.
Also Read : అనంతబాబు అజ్ఞాతం మిస్టరీ వెనుక టిడిపి ఎమ్మెల్యే..?
ప్యాట్ కమిన్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యంత తెలివైన కెప్టెన్లలో ఒకడు. క్లిష్ట సమయాల్లో ఫీల్డ్ సెట్టింగ్ చేయడంలో, సరైన బౌలింగ్ మార్పులు చేయడంలో దిట్ట. గత కొన్ని మ్యాచ్ ల్లో హైదరాబాద్ డిఫెన్స్ లో తడబడిన చోట, కమిన్స్ ఉంటే తన అనుభవంతో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు అంటూ ఫ్యాన్స్ భావించారు. అతను గ్రౌండ్ లో ఉంటే మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సీజన్ లో హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం.
కమిన్స్ తన స్లో బాల్స్, ఖచ్చితమైన యార్కర్లతో ఆఖరి ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడమే కాకుండా, రన్ రేట్ పెరగకుండా కట్టడి చేయడంలో అతనికి మంచి మార్కులే పడ్డాయి. జట్టు బ్యాటింగ్ లైనప్ లో కమిన్స్ ఒక అదనపు ఆయుధం. లోయర్ ఆర్డర్ లో వచ్చి కేవలం 10-15 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల హిట్టింగ్ సామర్థ్యం అతనికి ఉంది. గతంలో ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉన్న కమిన్స్, అవసరమైనప్పుడు ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు.
Also Read : దుర్గగుడిలో అధికారుల పాపాలు.. ఎందుకీ వరుస వివాదాలు..?
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్-4 రేసులో ఉంది. రాబోయే మ్యాచ్ లలో విజయం సాధించడం చాలా ముఖ్యం. ఇలాంటి ప్రెజర్ మ్యాచ్ లలో ఒత్తిడిని తట్టుకుని జట్టును గెలిపించే ‘ఐసీ కూల్’ మైండ్ సెట్ కమిన్స్ సొంతం. వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ గెలిచిన అనుభవం ఆయనకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి ప్యాట్ కమిన్స్ రాకతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, నాయకత్వ విభాగాల్లో సంపూర్ణంగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

