Saturday, May 23, 2026 01:04 PM
Saturday, May 23, 2026 01:04 PM

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే తులసి షాక్ ఇచ్చారా..?

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కేబినెట్‌ లో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి తులసీ గబ్బార్డ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను వైట్‌ హౌస్‌ కు పంపారు. ఈ రాజీనామా జూన్ 30 నుంచి అమలులోకి రానున్నట్లు గబ్బార్డ్ స్వయంగా ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు ఇటీవల ఒక అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు.

Also Read : సీమపై గురిపెట్టిన లోకేష్..!

అయితే, తులసీ గబ్బార్డ్ రాజీనామా వెనుక కేవలం కుటుంబ సమస్యలు మాత్రమే కాకుండా.. అంతర్గతంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు వాషింగ్టన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం, మిలిటరీ చర్యల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు, తులసి గబ్బార్డ్‌ కు మధ్య కాలంగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. విదేశీ యుద్ధాల్లో అమెరికా అనవసరంగా తలదూర్చడాన్ని గబ్బార్డ్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చారు.

Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..? 

కానీ ఇరాన్‌ పై దూకుడుగా వెళ్లాలనే ట్రంప్ నిర్ణయాలను ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోయారని, ఈ విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ఆయన ఒంటెద్దు పోకడలు మరియు ట్రంప్ మార్క్ పిచ్చిని తట్టుకోలేకనే ఆమె కేబినెట్ నుంచి బయటకు రావడానికి మొగ్గు చూపారనే టాక్ గట్టిగా నడుస్తోంది.

Also Read : సరికొత్త లుక్ తో 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..!

ట్రంప్ అంతర్గత రక్షణ బృందం కూడా ఆమెను కీలక నిర్ణయాల్లో దూరం పెడుతూ రావడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే ప్రచారం జరుగుతోంది. కేవలం భర్త క్యాన్సర్ ఇష్యూని ఒక సాకుగా చూపిస్తూ, ట్రంప్ సర్కార్‌ తో పడలేకే ఆమె ఈ గౌరవప్రదంగా ఎగ్జిట్ రూట్ ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులు సహా నలుగురు మహిళా టాప్ అధికారులు రాజీనామాలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

పోల్స్