Sunday, June 21, 2026 06:19 AM
Sunday, June 21, 2026 06:19 AM

అమెరికా, చైనాలో ఏం జరుగుతోంది..? 20 మంది టాప్ సైంటిస్టుల మాయం..!

ప్రపంచాన్ని సైన్స్ ను శాసిస్తున్న అమెరికా, చైనా దేశాల్లో ఇప్పుడు ఒక అదృశ్య యుద్ధం మొదలైంది. యుద్ధ విమానాలు, క్షిపణులతో కాకుండా.. మేధావుల ప్రాణాలతో సాగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణు పరిశోధన, హైపర్‌ సోనిక్ ఆయుధాల వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్న కనీసం 20 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరణించడం లేదా అదృశ్యం కావడం ఇప్పుడు అంతర్జాతీయ నిఘా వర్గాలను కుదిపేస్తోంది.

Also read : మంగ్లీకి ఆడియో సెగ.. స్కామ్‌ లో అడ్డంగా దొరికిపోయిందా..?

వాషింగ్టన్‌ లో అణు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన రంగాలకు చెందిన 11 మంది శాస్త్రవేత్తలు అదృశ్యమయ్యారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇది చాలా తీవ్రమైన విషయం అంటూ కామెంట్ చేసారు. దీని వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉండవచ్చని రిపబ్లికన్ నేతలు అనుమానిస్తుండటంతో, అమెరికా దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు చైనాలో పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. అక్కడ రక్షణ రంగంలో పనిచేస్తున్న తొమ్మిది మంది శాస్త్రవేత్తలు మరణించారు.

వీరి మరణాలన్నీ అర్ధరాత్రి వేళ కారు ప్రమాదాలు లేదా అంతుచిక్కని అనారోగ్యాల రూపంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ మరణాల్లో అత్యంత చర్చనీయాంశమైనది 38 ఏళ్ల ప్రొఫెసర్ ఫెంగ్ యాంగ్‌ హే కేసు. చైనా డిఫెన్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈయన, తైవాన్‌ పై యుద్ధం వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై పని చేసేవారు. 2023 జూలైలో తెల్లవారుజామున 2.35 గంటలకు జరిగిన ఒక కారు ప్రమాదంలో ఆయన మరణించారు.

Also read : అదరగొడుతున్న రాజస్థాన్ కెప్టెన్..!

విచిత్రమేమిటంటే, చైనా ప్రభుత్వం ఆయన్ను బలిదానం పొందిన వీరుడు అని సంబోధించడమే కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు మాత్రమే దక్కే బాబావోషాన్ స్మశానవాటికలో ఖననం చేసింది. ఒక సాధారణ శాస్త్రవేత్తకు సైనిక గౌరవాలు దక్కడం వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉందనే మాట వినపడుతోంది. అణుశక్తి, అధునాతన ఆయుధాల రంగంలో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్న వేళ.. అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఇలా వరుసగా కనుమరుగవ్వడం వెనుక గూఢచారి యుద్ధం జరుగుతోందని అంతర్జాతీయ మీడియా అంటుంది. ప్రత్యర్థి దేశం యొక్క రక్షణ రహస్యాలను దెబ్బతీయడానికి వారి మేధావులను టార్గెట్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్