Friday, June 26, 2026 12:19 PM
Friday, June 26, 2026 12:19 PM

15 ఏళ్ళ కుర్రాడితో టీం ఇండియా.. ఇంగ్లాండ్ టూర్..?

జాతీయ జట్టులో అవకాశం కోసం ఎందరో ఆటగాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న వయసు నుంచే పెద్ద కలలు కంటూ దూసుకుపోతూ ఉంటారు. కానీ కొందరికే అవకాశం వస్తుంది. అందులో వైభవ సూర్యవంశీ ఒకడు. గత ఏడాది ఐపిఎల్ మెగా వేలంలో రాజస్థాన్ జట్టుకు ఎంపిక అయినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. కానీ ఆ సీజన్ లో అతను ఆడిన ఆట తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత అండర్ 19 జట్టులో వచ్చిన అవకాశాలను ఈ కుర్రాడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

Also Read : సిగ్గు సిగ్గు.. జగన్‌ పరామర్శకు ఇవేనా అర్హతలు..?

తన ఆట తీరుతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు సూర్యవంశీ. తాజాగా భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో అతని పాత్ర కీలకం. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక అయ్యాడు ఈ బీహారి ఆటగాడు. ఫైనల్ లో ఏకంగా 175 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనితో అతను జాతీయ జట్టులోకి రావడం ఖాయం అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. ఈ ఏడాది జూన్ లో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. 3 వన్డేలు, 5 టి20 లు ఆడుతుంది. ఆ టూర్ కు సూర్యవంశీని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

Also Read : కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?

అప్పటికి అతని వయసు 15 ఏళ్ళు దాటుతుంది. 15 ఏళ్ళ వయసులో టీం ఇండియాకు ఆడిన ఏకైక ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించడం ఖాయం. ఆ టూర్ లో అతను రాణిస్తే మాత్రం వన్డే క్రికెట్ లోకి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సచిన్ 16 ఏళ్ళకే జాతీయ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ఎవరూ సచిన్ దగ్గరలోకి రాలేకపోయారు. కానీ సూర్యవంశీ కి ఆ ఛాన్స్ కనపడుతోంది. ఇక ఈ ఏడాది ఐపిఎల్ లో కూడా అతను రాణిస్తే మాత్రం జట్టులో అతని స్థానం ఖరారు అయినట్లే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

పోల్స్