Wednesday, November 11, 2026 12:31 PM
Wednesday, November 11, 2026 12:31 PM

అమెరికా ఐటీ ఉద్యోగులకు భారీ షాక్..!

అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారత సాఫ్ట్‌వేర్ నిపుణులకు దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు ఇకపై హెచ్-1బీ వీసాలతో పాటు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఐబీఎం అధికారికంగా ప్రకటించింది. లక్షన్నర మందికి పైగా ఉద్యోగులు పనిచేసే ఐబీఎం కన్సల్టింగ్ విభాగం నుండి వచ్చిన ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్కీలలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Also Read : స్థానిక విజయాలతో అహం వద్దు.. మంత్రులకు సీఎం వార్నింగ్..!

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీ ఐటీ ఉద్యోగుల నియామకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటమే ఐబీఎం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. గత నెలలోనే మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలకు పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను యూఎస్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ వచ్చేందుకు ఈ సర్టిఫికేషన్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశీలన మరింత పక్కాగా మారుతుండటంతో ఐబీఎం తాజా నిర్ణయానికి మొగ్గు చూపింది.

Also Read : చంద్రబాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్ల కలవరం..!

గతంలో ఐబీఎం కన్సల్టింగ్ విభాగం నైపుణ్యాల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులపై ఆధారపడినప్పటికీ, గత కొన్నేళ్లుగా ఆ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్థానికంగానే నిపుణులు అందుబాటులోకి రావడం, క్లయింట్ల అవసరాలు మారడంతో ఈ స్పాన్సర్‌షిప్‌లకు స్వస్తి పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభావితమైన విదేశీ ఉద్యోగులు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం బ్రాంచ్‌లలో పనిచేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఈ ఏడాది చివరికల్లా కంపెనీని వీడాల్సి వస్తుందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక...

మిర్చి రైతుల కోసం...

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

నాకేమీ పేటీఎంలో డబ్బులు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై...

స్థానిక విజయాలతో అహం...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల...

పోల్స్