Tuesday, November 10, 2026 07:04 PM
Tuesday, November 10, 2026 07:04 PM

నాకేమీ పేటీఎంలో డబ్బులు రాలేదు.. రేణూ దేశాయ్ కీలక కామెంట్స్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోల్స్, జరుగుతున్న ప్రచారాలపై ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఒక ప్రకటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి కష్టంలో ఉంటే వారిని మరింత దూషించడం, ఇప్పటికే కిందపడిపోయిన వారిని తొక్కడం ఏమాత్రం నైతికత కాదని ఆమె హితవు పలికారు. అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, వాళ్లు కూడా ఒక మనిషేనని, ఒక తల్లిదండ్రులకు పుట్టినవారేనని లేదా ఒకరి తోడబుట్టినవారేనని ఎప్పుడూ మరచిపోకూడదని ఆమె గుర్తుచేశారు.

Also Read : పెట్రోల్ బంకులలో కొత్త మోసం.. పెట్రోల్‌కు బదులు నీళ్లు..!

మనం అందరం లోపాలున్న అద్దాల మేడల్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానేయాలని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. మనం అందరం మనుషులమేనని పేర్కొంటూ, అసలు ఒక మనిషి అనిపించుకోవడానికి కావాల్సిన అత్యంత ప్రాథమిక లక్షణాలు కేవలం సానుభూతి, దయ మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు. తాను రాసిన ఈ మాటలను బట్టి ఎవరూ పిచ్చి పిచ్చి ఊహాగానాలు, వక్రీకరణలు మొదలుపెట్టవద్దని ఆమె కోరారు. ఒక సమాజంగా మనం ఇంకా ఎంతో మెరుగ్గా ఉండగలమని, మానవత్వం పరిమళించగలదని తాను మనసూర్తిగా నమ్ముతున్నట్లు తెలిపారు.

Also Read : వైసీపీ మీద ఓటర్లకు ఎందుకు కోపమంటే..!

అలాగే, తాను ఎవరికో అనుకూలంగా మాట్లాడటానికి, దయగా, వివేకంగా మాట్లాడటానికి తనకేమీ పేటీఎంలో డబ్బులు రాలేదని రేణూ దేశాయ్ కుండబద్దలు కొట్టారు. ఎవరి ప్రభావంతోనో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, సరిగ్గా పనిచేసే మెదడు ఉన్న ఎవరైనా సరే సమాజంలో ఇలాగే ఆలోచించడం పూర్తిగా సహజమని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని చేసే తప్పుడు ప్రచారాలు, అర్థంపర్థం లేని ఊహాగానాలకు ఈ ఘాటు వ్యాఖ్యలతో ఆమె గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

స్థానిక విజయాలతో అహం...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల...

వైసీపీ మీద ఓటర్లకు...

అప్పుడు వైసీపీ ఓటమికి, వైసీపీ రెడ్లు,...

పవన్ విడాకులపై వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్...

పెట్రోల్ బంకులలో కొత్త...

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో...

తెలంగాణాలో సంచలన తీర్పు.....

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది....

పోల్స్