Wednesday, November 11, 2026 12:31 PM
Wednesday, November 11, 2026 12:31 PM

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.. సాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం ఆయన తన నూతన పార్టీ పేరు.. పరివర్తన రాజనీతి పార్టీ.. అని వెల్లడించారు. జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం.. 11వ నెల, 11వ తేదీన, సరిగ్గా ఉదయం 11 గంటల 11 నిమిషాల అత్యంత అరుదైన, ప్రత్యేక ముహూర్తానికి ఆయన ఈ సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.

Also Read : నాకేమీ పేటీఎంలో డబ్బులు రాలేదు.. రేణూ దేశాయ్ కీలక కామెంట్స్..!

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయం కాబోతుందని ధీమా వ్యక్తం చేసారు సాయి రెడ్డి. దశాబ్దాలుగా రాష్ట్రంలో నడుస్తున్న రెండు ప్రధాన పార్టీలు, రెండు రాజకీయ కుటుంబాల ఆధిపత్య పోరుకు ముగింపు పలకడమే తమ పరివర్తన రాజనీతి పార్టీ.. యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కుల, మత పిచ్చి రాజకీయాలను పూర్తిగా తిరస్కరించి, కేవలం ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా, ప్రజాసమస్యల పరిష్కారం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యాలుగా ఈ పార్టీ ముందుకు సాగుతుందని విజయసాయిరెడ్డి వివరించారు.

Also Read : సీఎం చంద్రబాబు భద్రతా ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం..!

ముఖ్యంగా ఈ కొత్త పార్టీ ద్వారా జెన్ జీ యువతకు, సరికొత్త తరం నాయకులకు రాజకీయాల్లో పెద్దపీట వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతీ ఎకరానికి రెండు పంటల సాగు నీరు, ఉచిత విద్యుత్, చదువుల భారం తగ్గింపు, 100 శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పార్టీ విధానపరమైన హామీలను ప్రకటించారు. కాగా, విజయసాయిరెడ్డి కొత్త పార్టీ స్థాపించిన తొలిరోజే ఇతర పార్టీల నుండి వలసలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు పరివర్తన రాజనీతి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మిర్చి రైతుల కోసం...

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

నాకేమీ పేటీఎంలో డబ్బులు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై...

స్థానిక విజయాలతో అహం...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల...

వైసీపీ మీద ఓటర్లకు...

అప్పుడు వైసీపీ ఓటమికి, వైసీపీ రెడ్లు,...

పోల్స్