Wednesday, November 11, 2026 03:15 PM
Wednesday, November 11, 2026 03:15 PM

ఎవరి బీ టీమ్ కాదు.. హామీ ఇస్తున్నా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సరికొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. వైఎస్ కుటుంబానికి దాదాపు 40 ఏళ్ల పాటు సేవ చేసి, జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తన రాజకీయ పార్టీని ప్రారంభించారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కానీ అనూహ్యంగా రాజకీయాల పైన వ్యాఖ్యలు, నాయకుల పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తాను స్వయంగా రాజకీయ పార్టీ మొదలుపెడుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.

Also Read : సీఎం చంద్రబాబు భద్రతా ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం..!

రాజకీయ పార్టీని విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ అని సాయిరెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి పరివర్తన రాజనీతి అనేవి హిందీ పదాలు. ఇవి ప్రజల్లోకి అంత సులువుగా వెళ్లడం చాలా కష్టం. అందుకే తన పార్టీకి షార్ట్ ఫామ్ కూడా సాయిరెడ్డి ప్రకటించారు. పీఆర్‌పీ అని వెల్లడించారు. నిజానికి పార్టీ పేరు ప్రకటించే సమయంలో నేతలు షార్ట్ ఫామ్ ప్రకటించరు. కానీ సాయిరెడ్డి మాత్రం పీఆర్‌పీ అని షార్ట్ చేసేశారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఎన్నికల్లో పీఆర్‌పీ ఓడిపోవడంతో.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. కానీ ఇప్పటికీ ఆ పార్టీ పేరును అంతా పీఆర్‌పీ అనే పిలుస్తారు.

ఇప్పుడు విజయసాయిరెడ్డి తన పార్టీ పేరును ప్రస్తావించిన ప్రతిసారి.. పీఆర్‌పీ అనే మాటను పదే పదే చెప్పుకొచ్చారు. జనం కోసం.. జన హితం కోసం.. అని ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యమని ప్రకటించారు. అదే సమయంలో తాను ఎవరికీ బీ టీమ్ కాదని.. స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని.. తన పార్టీలో 66 శాతం యువతకే టికెట్లు ఇస్తామన్నారు. యువత అంటే.. తాను కాదన్న సాయిరెడ్డి.. 40 ఏళ్ల లోపు వారే.. అని మరోసారి స్పష్టం చేశారు. సీఎం పదవి ఆ రెండు కులాలకేనా.. అని ప్రశ్నించిన సాయిరెడ్డి.. బీసీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

Also Read : ట్రోలర్స్ కు సాయి పల్లవి స్లిప్పర్ షాట్..!

తన రాజకీయ ప్రసంగంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను ప్రధానంగా ప్రస్తావించారు. అదే సమయంలో వైసీపీ పరిపాలనలో జరిగిన ఘోరాలు, వైసీపీ 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యిందనే విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని.. కేవలం వైసీపీ నేతల అహంకారం వల్లే ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందన్నారు. తన రాజకీయ పార్టీ ప్రకటన వల్ల ఏపీలో చర్చ మొదలైందని.. రెండు ప్రధాన పార్టీల్లో అసంతృప్తులున్నారని.. వారికి పీఆర్‌పీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. పదవులు భిక్ష అడగలేదని.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదన్నారు. రాజకీయాల్లో విధేయత ఉండాలే కానీ.. బానిసత్వం కాదు అన్నారు విజయసాయిరెడ్డి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక...

మిర్చి రైతుల కోసం...

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

నాకేమీ పేటీఎంలో డబ్బులు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై...

పోల్స్