Tuesday, April 21, 2026 08:53 PM
Tuesday, April 21, 2026 08:53 PM

మహానాడు వేదిక ఖరారు.. ఈసారి అదిరిపోవాల్సిందే..!

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది మహానాడు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు పుట్టినరోజు నాడు మహానాడు నిర్వహించడం సంప్రదాయం. 2025లో మహానాడును రాయలసీమలోని కడప జిల్లా పాపులూరులో నిర్వహించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా కడప నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2022లో ఒంగోలు సమీపంలో మహానాడు నిర్వహించారు. ఆ తర్వాత 2023లో రాజమండ్రి సమీపంలో జరిగింది. ఎన్నికల కారణంగా 2024 మహానాడును నిర్వహించలేదు. అయితే ఈసారి మాత్రం ఉత్తరాంధ్రను ఎంపిక చేశారు అధినేత చంద్రబాబు.

Also Read : బిసిసిఐపై గౌతమ్ గంభీర్ ఫైర్..? గిల్ పరిస్థితి ఏంటి..?

శ్రీకాకుళం – విజయనగరం సరిహద్దుల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కూడా వ్యూహమే.! శరవేగంగా ముస్తాబవుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట పోర్టు పనుల నుంచి టీడీపీ శ్రేణులు స్ఫూర్తి పొందుతాయనేది పార్టీ నేతల మాట. ఇక టీడీపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఇటీవలే ప్రకటించారు. పొలిట్ బ్యూరోలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభ్యులు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అధికార ప్రతినిధిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బెందాళం అశోక్ వంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు. గజపతినగరం నుంచి ముందస్తు వ్యూహంతో ఒక మండల స్థాయి నాయకురాలికి ప్రమోషన్ ఇచ్చారు.

మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28న నూతన జాతీయ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. అంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ నాయుడుకు ఈ మహానాడు ఎంతో కీలకం. దీంతో ఈ మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉత్తరాంధ్ర నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మహానాడు ఏర్పాట్ల బాధ్యతను శ్రీకాకుళం జిల్లా నేతలు నెత్తికెత్తుకున్నారు.

Also Read : బర్త్ డే గిఫ్ట్ అదిరింది కదా చంద్రయ్యా..!

మహానాడును ముందుగా నెల్లిమర్లలో నిర్వహించాలని భావించారు. కానీ అది జనసేన నేత లోకం నాగ మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. పైగా రాకపోకలు, ట్రాఫిక్, సెక్యూరిటీ, వసతి సౌకర్యాల సమస్యలు వస్తాయని భావించారు. జాతీయ రహదారికి సమీపంగా, ప్రధాన నగరాలకు అందుబాటులో ఉండేలా వేదిక ఉండాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచించటంతో పూసపాటిరేగ, పాతృనివలస మధ్యలో ఉన్న పలు ప్రాంతాలను టీడీపీ నేతల బృందం మూడు రోజుల పాటు పరిశీలించింది. రణస్థలం – పైడి భీమవరం మధ్యలో పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు సొంత భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇది వేదికకు సరిగ్గా సరిపోతుందని భావించారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక అతిథులు కోసం ప్రత్యేకంగా రిసార్ట్స్ పరిశీలిస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రాంతానికి చెందిన నేత కావడంతో.. ఆయనకు ఈ ప్రాంతంపై గట్టి పట్టు ఉంది. అందుకే వసతి బాధ్యతలను అప్పలనాయుడుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక మహానాడు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర సాంప్రదాయ వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నారు.

Also Read : జీరో బ్యాలెన్స్ ఎకౌంటు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి..?

మహానాడు కోసం ఉత్తరాంధ్రను ఎంచుకోవడంలో చాలా పెద్ద వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంపైన తూర్పు కాపులు, గిరిజనులపైన గురి పెట్టారని ఇప్పటికే పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాగబాబు హడావుడి చేస్తున్నారు. పాతపట్నం టీడీపీలో అంతర్గత విభేదాలు, పాలకొండలో టీడీపీ క్యాడర్ తిరిగి పుంజుకునేందుకు, అటు కురుపాం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో జనసేన నేతలకు చెక్ పెట్టడంతో పాటు ధర్మాన, బొత్స వంటి వైసీపీ సీనియర్ నేతల దూకుడుకు కూడా కళ్లెం వేసినట్లు అవుతుందంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్ద దస్తగిరి హత్య...

కడపలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద...

జనసేన వర్సెస్ టీడీపీ.....

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం...

సీఎం చంద్రబాబుకు మంత్రి...

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఏపీ...

ఏపీలో విచిత్రం.. నేతల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష...

బర్త్ డే గిఫ్ట్...

వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామిరెడ్డికి...

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం...

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై...

పోల్స్