Monday, August 3, 2026 09:44 PM
Monday, August 3, 2026 09:44 PM

జీరో బ్యాలెన్స్ ఎకౌంటు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి..?

నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ మరింత సులభతరమైంది. ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు సామాన్యులకు, యువతకు పెద్ద వరంగా మారాయి. మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన లేకపోవడమే దీని ప్రధాన ఆకర్షణ. అయితే, మార్కెట్లో ఉన్న అనేక ఆప్షన్లలో మీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ ఎకౌంటు ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఎక్కువగా ఆన్లైన్‌ లోనే మెయింటేన్ చేస్తారు. కాబట్టి, సదరు బ్యాంక్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ఎంత ఈజీగా ఉందో గమనించాలి.

Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఫండ్ ట్రాన్స్‌ఫర్, బిల్ పేమెంట్స్ మరియు స్టేట్‌మెంట్ డౌన్లోడ్ వంటి ఫీచర్లు వేగంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రతి జీరో బ్యాలెన్స్ ఎకౌంటు కు కొన్ని లిమిట్స్ ఉంటాయి. మరి నెలకు ఎన్నిసార్లు ఉచితంగా నగదు విత్‌డ్రా చేయవచ్చు..? యూపీఐ లావాదేవీలపై ఏవైనా ఛార్జీలు ఉన్నాయా..? అనేవి ముందుగానే సరిచూసుకోవాలి. కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు ఇవ్వడానికి లేదా వార్షిక మెయింటెనెన్స్ కోసం కొంత చార్జీలు వసూలు చేస్తాయి. మీ డబ్బుకు సెక్యూరిటీ ఇవ్వడంలో బ్యాంక్ ఎంత పటిష్టంగా ఉందో చూడాలి.

Also Read : షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.. దారుణ కామెంట్..!

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాగిన్, ఇన్స్టంట్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్న బ్యాంకులకే మొగ్గు చూపడం మంచిది. బ్యాంకుకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే కూర్చుని వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరిచే సదుపాయం ఉందో లేదో చూడండి. ఆధార్ మరియు పాన్ కార్డుతో నిమిషాల్లో అకౌంట్ యాక్టివేట్ అయ్యే ఫీచర్ ఉన్న బ్యాంకులు సమయాన్ని ఆదా చేస్తాయి. జీరో బ్యాలెన్స్ అయినప్పటికీ, మీ సేవింగ్స్ పై వడ్డీ రేటు ఎంత వస్తోంది..? డెబిట్ కార్డుపై ఏవైనా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు లేదా రివార్డ్ పాయింట్లు వస్తున్నాయా..? అనేది గమనించండి. కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ కవర్ లేదా ఉచిత చెక్ బుక్ వంటి అదనపు సౌకర్యాలను కూడా కల్పిస్తాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్