Sunday, June 21, 2026 11:28 AM
Sunday, June 21, 2026 11:28 AM

మీరు ఇండియన్ అయితే.. రాహుల్ కు సుప్రీం కోర్ట్ షాక్

ఈశాన్య భారత్ తో పాటుగా సుదీర్ఘంగా ఉన్న సరిహద్దుల్లో చైనా భారత్ ను ఆక్రమించింది అనే ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం. ఈ విషయంలో బిజెపి – కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వ్యాఖ్యల వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. ‘ భారత్ జోడో యాత్ర ‘ సందర్భంగా రాహుల్ గాంధీ.. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దళాలు భారత సైనికులను కొడుతున్నాయి అంటూ ఆరోపించారు. దీనిపై పరువు నష్టం కేసు దాఖలు కాగా.. సుప్రీం కోర్ట్ రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది.

Also Read : రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై.. తపాలా శాఖ కీలక నిర్ణయం..!

2022 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్-చైనా ఘర్షణను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్య చేశారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆయన మండిపడ్డారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్.. 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనీయులు ఆక్రమించుకున్నారని మీకు ఎలా తెలిసింది? అని ప్రశ్నించింది.

Also Read : మెగా ఫ్యామిలీకి గడ్డు కాలమే..?

మీరు భారత పౌరుడు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ఘాటుగా వ్యాఖ్యానించింది. మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే… ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు? అని తన వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. మరి పార్లమెంట్ లో అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ కు నోటీసులు జారీ చేసింది కోర్ట్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్