Wednesday, July 22, 2026 05:16 AM
Wednesday, July 22, 2026 05:16 AM

అమెరికా-ఇరాన్ మధ్య సంచలన ఒప్పందం..!

మిడిల్ ఈస్ట్‌ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక కీలకమైన శాంతి ఒప్పందం దాదాపు ఖరారైంది. ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయి. ఈ సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. అయితే ఈ ఒప్పంద ముసాయిదాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు.

Also Read : చక్రం తిప్పిన మెగా.. డిప్యూటీ సీఎంకు చెడ్డపేరు..!

ఖతార్, పాకిస్తాన్ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా 300 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.25 లక్షల కోట్లతో.. అంతర్జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడానికి అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. తుది ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికన్ చమురు, ఇంధన సంస్థలు ఇరాన్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తారు. అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన ఇరాన్‌ కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంపై కూడా ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

Also Read : టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్.. రసవత్తరమైన పోరు

ప్రపంచ వాణిజ్య నౌకల రాకపోకలకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఉంచిన మైన్లను 30 రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నౌకాదళ దిగ్బంధాన్ని దశలవారీగా ఎత్తివేస్తుంది. అటు ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఏం చేయాలనే దానిపై ఈ 60 రోజుల వ్యవధిలో చర్చిస్తారు. తాము అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించే క్లాజ్ కూడా ఇందులో భాగమైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్