ఈ ఏడాది ఆగస్ట్ నెల తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత కీలకంగా మారనుంది. టాలీవుడ్ క్రేజీ హీరోల చిత్రాలు వారాల వ్యవధిలోనే విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనబోతోంది. ఇది సినీ ప్రియులకు అసలైన పండగ. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌లో సరైన సినిమాలు రాలేదనేది మూవీ లవర్స్ మాట. సంక్రాంతికి వరుసగా 5 సినిమాలు విడుదల చేశారు. ఆ తర్వాత పవన్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ తప్ప.. ఇప్పటి వరకు మరో పెద్ద సినిమా రాలేదు. దీంతో జూన్ 4న రానున్న పెద్ది పైనే టాలీవుడ్ పెద్దలు గంపెడాశ పెట్టుకున్నారు. అయితే సినీ లవర్స్ మాత్రం.. ఆగస్టు కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా నాలుగు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read : పెద్ది క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ సీన్.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ..!
ఆగస్టు రేసులో మెగాస్టార్ చిరంజీవితో పాటు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ‘విశ్వంభర’.. ఆగస్టు రేసులో ఉంది. అందరి కళ్లు మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పైనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాకు ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ ఈ సినిమా ఆగస్ట్ రేస్‌లోనే ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. ఒకవేళ మెగాస్టార్ సినిమా కూడా ఆగస్ట్‌లో కన్ఫర్మ్ అయితే, బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. థియేటర్ల సర్దుబాటుతో పాటు కలెక్షన్ల పరంగా మిగిలిన సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతుంది.
ఆగస్టులో రేసులో ఖాయమైన సినిమా నాని.. ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుస విజయాలతో నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నాని వైవిధ్యమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్, సాలిడ్ మార్కెట్ కారణంగా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా పాట యూ ట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాపై భారహీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఏప్రిల్‌లోనే రావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఆలస్యం వల్ల ఆగస్టు 21న ‘ది ప్యారడైజ్’ వస్తోంది.
ఆగస్టులో నిలిచిన మరో సినిమా శర్వానంద్ ‘భోగి’. ఇది ఆగస్ట్ 28న విడుదలయ్యే అవకాశాలున్నాయి. నాని సినిమా వచ్చిన సరిగ్గా వారం రోజులకే టాలెంటెడ్ హీరో శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో బరిలోకి దిగుతున్నారు. టైటిల్ విభిన్నంగా ఉండటంతో ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను లేదా ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. నాని చిత్రంతో క్లాష్ ఉన్నప్పటికీ, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ దీనికి ప్లస్ కావచ్చు.
Also Read : బెంగాల్ దంగల్.. మమతా దీదీకి షాక్..!
రవితేజ హీరోగా దేవుడు – కూతురు సెంటిమెంట్‌తో వస్తున్న సినిమా ‘ఇరుముడి’. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ కూడా ఆగస్ట్ రేస్‌లో జాయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. దానికి ప్రధాన కారణం.. ఇందులో ఉండే తండ్రి – కూతుళ్ల ఎమోషన్, భక్తి నేపథ్యం. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ ఉండటం వల్ల ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి విడుదలైన భర్త మహాశేయులకు విజ్ఞప్తి సినిమా రవితేజను నిరాశపరిచింది. దీంతో “ఇరుముడి” పైన రవితేజ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.
మొత్తంమీద ఆగస్ట్ నెలలో క్లాస్, మాస్, ఎమోషనల్, ఫాంటసీ జోనర్ చిత్రాలు పోటీ పడుతుండటంతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. చిరంజీవి, నాని, రవితేజ, శర్వానంద్ చిత్రాల మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ వార్ చాలా ఆసక్తికరంగా మారనుంది.

