Wednesday, July 22, 2026 04:27 AM
Wednesday, July 22, 2026 04:27 AM

ఏపీ లిక్కర్ స్కామ్‌ లో సంచలనం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వరరెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఆయనకు సంబంధించిన బినామీలను సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read : టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్.. రసవత్తరమైన పోరు

నాగేశ్వరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తన పరపతిని ఉపయోగించుకుని వందల కోట్ల రూపాయల కబ్జాలు, అక్రమ వసూళ్లు, భూ సెటిల్మెంట్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సంపాదనతో విజయవాడలోని ఒక ప్రముఖ కార్ల షోరూమ్‌ లో భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు సిట్ నిర్ధారించింది. అంతేకాకుండా, తన బావమరిది భాగస్వామ్యంతో ఒక పెద్ద సాఫ్ట్‌ వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. నాగేశ్వరరెడ్డి సాగించిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఒక ప్రవాస భారతీయుడిని తీవ్రంగా బెదిరించి, కృష్ణా జిల్లా పరిధిలోని సుమారు 40 ఎకరాల విలువైన భూమిని ఆయన స్వాహా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. దీనితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని ప్రసిద్ధ హాథీరామ్ జీ మఠానికి చెందిన విలువైన భూములను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం స్థిరాస్తులు, వ్యాపారాలే కాకుండా నగదు, బంగారం రూపంలో కూడా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.

Also Read : బెంబేలెత్తిస్తున్న ఎబోలా.. హైఅలర్ట్..!

నాగేశ్వరరెడ్డి భార్య పేరిట సుమారు రెండున్నర కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే ఆమెకు సంబంధించిన ఒకే ఒక బ్యాంక్ అకౌంట్‌లో ఏకంగా రూ.19.85 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించి అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ నిధుల మూలాలపై సిట్ మరిన్ని బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్