Wednesday, August 19, 2026 12:25 AM
Wednesday, August 19, 2026 12:25 AM

ఒకప్పుడు రాజస్థాన్ ప్లేయర్.. ఇప్పుడు ఆర్సీబీ బాస్..!

ఐపిఎల్ ఎప్పుడూ ఏదోక సంచలనం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు అమ్ముడైన ఒక ఆటగాడు, ఇప్పుడు ఏకంగా అదే లీగ్‌ లో అత్యంత పాపులర్ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి యజమానిగా మారాడు. అతనే ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ విక్రమ్ బిర్లా. ఆర్యమాన్ బిర్లా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆయనకు క్రికెట్‌ తో విడదీయలేని అనుబంధం ఉంది.

Also Read : దేశంలో సీట్ల పెంపు సందడి.. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పండగ..!

2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్యమాన్ బిర్లాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2018, 2019 సీజన్లలో టీం మెంబర్ గా ఉన్నాడు. మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన ఆర్యమాన్, రంజీ ట్రోఫీలో ఒక సెంచరీ కూడా సాధించాడు. అయితే, మానసిక సమస్యల కారణంగా 2019లో క్రికెట్‌ కు తాత్కాలిక విరామం ప్రకటించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న ఆర్సీబీని, ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది.

Also Read : ధురంధర్ ఎఫెక్ట్.. మరీ అంత భయమా..!

సుమారు రూ. 16,700 కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీకి పలికిన అత్యధిక ధరగా చెప్పవచ్చు. ఈ కొత్త యాజమాన్యంలో ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టనున్నారు. టైమ్స్ గ్రూప్‌ కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌ గా వ్యవహరిస్తారు. ఆర్యమాన్ బిర్లాకు ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ తో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ గతంలో మధ్యప్రదేశ్ రంజీ జట్టులో ఓపెనర్లుగా కలిసి ఆడటం విశేషం. ఇప్పుడు తన పాత టీమ్ మేట్ ఆడుతున్న జట్టుకే ఆర్యమాన్ బాస్ కావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్