Wednesday, May 13, 2026 04:50 PM
Wednesday, May 13, 2026 04:50 PM

ధురంధర్ ఎఫెక్ట్.. మరీ అంత భయమా..!

ధురంధర్.. ఇది ఒక సినిమా మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న సినిమా. పాటలు, ఫైట్లు, యాక్షన్.. ఇలా అన్నీ చక్కగా ఉన్న సినిమా. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఓ స్పై యాక్షన్ సినిమా థ్రిల్లర్ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆదిత్య ధార్ రచించి, దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరించారు. గతేడాది డిసెంబర్ 5న పార్ట్ వన్ రిలీజ్ కాగా.. ఈ నెల 19న పార్ట్ 2ను దర్శక, నిర్మాతలు రిలీజ్ చేశారు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ.. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Also Read : దానంపైనే బీఆర్ఎస్ గురి..? ఎందుకీ రివేంజ్..?

ఓ స్ప్రై యాక్షన్ సినిమా ఇప్పుడు పొరుగు దేశంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి అది ఓ సినిమా. అందులో కథ నిజం కావచ్చు.. కల్పితం కూడా కావచ్చు. నిజానికి ఈ సినిమా ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్టార్ హీరోలతో నిర్మించారు. అయితే ఈ సినిమా భారత్‌లో ప్రశంసలు అందుకుంటుంటే.. ఇప్పుడు పాకిస్తాన్‌లో మాత్రం కలకలం రేపుతోంది. పాకిస్తాన్‌లో సొంత వారిని కూడా నమ్మే పరిస్థితి లేనట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దారిని పోయే వారిని.. చివరికి అడుక్కునే వారిని కూడా అనుమానంగా చూస్తున్నారు పాకిస్తానీలు. వీళ్లు మనవాళ్లా.. లేక ఇతర దేశాల నుంచి వచ్చిన గూఢచారులా అని అనుమానిస్తున్నారు.

ధురంధర్ 2 సృష్టించిన ప్రకంపనలతో పాకిస్తాన్‌లో.. కరాచీ వంటి పట్టణాల్లో ప్రజలు ఎవరినీ చూసినా సరే.. భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొత్త వారితో మాట్లాడాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. భారతీయ గూఢచారులు తమ మధ్య ఉన్నారని పాకిస్తానీయులు బాగా నమ్ముతున్నారు. గ్యాంగ్ వార్లకు పేరు మోసిన లియారి ప్రాంతంలో ఇప్పుడు స్పై హంట్ జోరుగా జరుగుతోంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని చూసి కూడా పోలీసులు, స్థానికులు భయపడుతున్నారు. వారిని లేపి.. గుర్తింపు పత్రాలు చెక్ చేస్తున్నారు. అవేవీ లేకపోతే వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు.. వారిని ప్రశ్నిస్తూ.. పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

Also Read : మతం మారితే రిజర్వేషన్ రద్దు..!

పాకిస్తాన్‌లో పరిస్థితులపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఆందోళన వ్యక్తం చేశారు. ధురంధర్ తర్వాత పాకిస్థాన్‌లో విశ్వాసం పూర్తిగా పోయిందన్నారు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటను ఆచి తూచి మాట్లాడుతాను, వింటున్న వ్యక్తి భారత ఏజెంట్ ఏమోనని నిరంతరం అనుమానంతో ఉంటాను. ఈ దశలో, ఎవరు నిజమో.. ఎవరు కాదో తెలుసుకోవడానికి ప్రభుత్వం వీధి బిచ్చగాడి నుండి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరినీ ఒక్కొక్కరిగా విచారించాల్సిన అవసరం ఉందని అఫ్రీది చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితులను అద్దం పడుతున్నాయి. ఒక్క సినిమా.. పాకిస్తాన్ ప్రజల్లో ఈ రేంజ్‌లో గుబులు రేపింది. పాకిస్తాన్ వీధుల్లో పోలీసులు చేస్తున్న సోదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

పోల్స్