Friday, October 9, 2026 08:50 AM
Friday, October 9, 2026 08:50 AM

డబుల్ చిన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

ముఖం ఎంత అందంగా ఉన్నా, గడ్డం కింద అదనపు కొవ్వు లేదా డబుల్ చిన్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇదో మానసిక సమస్య కూడా. అయితే కేవలం వ్యాయామం ద్వారానే కాదు, సరైన యోగాసనాలతో కూడా ఈ డబుల్ చిన్‌ ను సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖం కండరాలను బిగుతుగా మార్చి, మిమ్మల్ని యంగ్‌ గా కనిపించేలా చేసే ఆ పవర్‌ఫుల్ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read : కుప్పకూలిన బంగారం ధరలు.. కొనేవారికి పండగే..!

సింహాసనం అనే యోగా.. ముఖం కండరాలకు ది బెస్ట్ వ్యాయామంగా చెప్తారు నిపుణులు. మోకాళ్లపై కూర్చుని, నాలుకను సాధ్యమైనంత బయటకు చాపి, కళ్లను పెద్దవిగా చేసి సింహంలా గర్జించాలి. ఇది గొంతు మరియు గడ్డం దగ్గరి కండరాలను స్ట్రెచ్ చేసి, అక్కడ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే భుజంగాసనం కూడా హెల్ప్ అవుతుంది. బోర్లా పడుకుని, అరచేతులను నేలపై ఉంచి, శరీరం పైభాగాన్ని పైకి లేపి ఆకాశం వైపు చూడాలి. ఇలా చేస్తే మెడ భాగాన్ని వెనక్కి వంచడం వల్ల గడ్డం కింద ఉన్న చర్మం సాగి, డబుల్ చిన్ తగ్గుతుంది.

Also Read : అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

ఫిష్ ఫేస్ కూడా బాగా సహకరిస్తుంది. ఇది చాలా ఈజీగా ఎక్కడైనా చేయవచ్చు. మీ బుగ్గలను లోపలికి పీల్చుకుని, పెదవులను చేప నోరులా పెట్టి నవ్వడానికి ప్రయత్నించండి. ఇది ముఖం కండరాలను టోన్ చేస్తుంది. దవడ ఎముక షార్ప్‌ గా కనిపించేలా చేస్తుంది. ఇక గ్రీవా సంచాలన కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. మెడను నెమ్మదిగా కుడి నుండి ఎడమకు, మళ్ళీ వెనక్కి వృత్తాకారంలో తిప్పాలి. మెడ చుట్టూ రక్త ప్రసరణ పెంచి, అక్కడ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చివరిది.. చిన్ లిఫ్ట్.. నిలబడి లేదా కూర్చుని తల పైకి ఎత్తి ఆకాశం వైపు చూడాలి. ఇప్పుడు ముద్దు పెడుతున్నట్లు పెదవులను పైకి చాచాలి. ఇది నేరుగా డబుల్ చిన్ ఉన్న భాగంపై ఒత్తిడి తెచ్చి, కొవ్వును వేగంగా కరిగిస్తుంది. రోజు 10 నుంచి 15 నిమిషాలు ఇవి చేస్తే మంచి ఎఫెక్ట్ ఉంటుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్