Wednesday, August 12, 2026 09:41 AM
Wednesday, August 12, 2026 09:41 AM

రఘురామ భూమి కబ్జా.. అసలేం జరిగింది..?

విశాఖపట్నంలో భూమాఫియా అరాచకాలు పరాకాష్టకు చేరాయి. సామాన్యుల భూములకే రక్షణ లేదనుకుంటే, ఏకంగా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో కేటుగాళ్లు కబ్జా చేశారు. ఈ సంచలన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఐటీ కారిడార్ పరిధిలో తీవ్ర కలకలం రేగుతోంది. పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌ లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు విశాఖ మధురవాడ ఐటీ సెజ్ పరిధిలోని మారుతీనగర్ లేఅవుట్.. సర్వే నంబర్ 374/1లో 333.33 గజాల విలువైన స్థలం ఉంది.

Also Read : తిరుపతిలో భూమన భారీ భూబాగోతాలు..!

1989లో ఆయన ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్.. డాక్యుమెంట్ నంబరు 6725/89 చేయించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ గజం ధర దాదాపు రూ.70 వేల వరకు పలుకుతుండటంతో, ఈ స్థలం విలువ రూ.2 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, రఘురామ కొనుగోలు చేసిన ఐదు నెలలకే.. అదే స్థలాన్ని నిందితులు సుబ్రహ్మణ్యంరాజు అనే వ్యక్తి పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత 1993లో సత్యనారాయణమ్మ పేరుకు, తిరిగి 2001లో గణపతిరాజు సాయిభాస్కర్ పేరుకు నకిలీ పత్రాల ద్వారా ఈ స్థలాన్ని బదిలీ చేసేశారు.

Also Read : నేను హిందువునే.. జేడి వాన్స్ భార్య సంచలనం..!

ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు సదరు స్థలంలో రక్షణ గోడ నిర్మించేందుకు పునాదులు తీయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన రఘురామకృష్ణరాజు స్నేహితుడు లక్ష్మణ మూర్తిరాజు వెంటనే ఆయనకు సమాచారం అందించారు. దీనిపై రఘురామ తన ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపి అంతర్గత విచారణ జరపగా, తన సంతకాన్ని దారుణంగా ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తేలింది. తన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా, నకిలీ సంతకాలతో మోసానికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు పేరుతో పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌ లో ఈ నెల 20న ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ భారీ భూ కుంభకోణం వెనుక విశాఖకు చెందిన ఏయే పెద్దల హస్తం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్