ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రయాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబైకి, తాజాగా జరిగిన మ్యాచ్ లో ఎదురైన పరాజయం కోలుకోలేని దెబ్బ తీసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబైకి, ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ సెమీఫైనల్ తో సమానం. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో అదరగొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది.
గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి వల్ల ముంబై ప్లేఆఫ్ అవకాశాలు కేవలం తమ ప్రదర్శన మీద మాత్రమే కాకుండా, ఇతర జట్ల గెలుపోటములపై కూడా ఆధారపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఇకపై పొరపాట్లు చేయడానికి ముంబైకి అస్సలు అవకాశం లేదు. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ప్రస్తుతం ఉన్న సమీకరణాలు చూస్తే.. ముంబైకి మిగిలి ఉన్న 6 మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కటి గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్ ఆశలు దాదాపు గాలిలో కలిసిపోతాయి.
కేవలం గెలిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ముంబై నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండటం పెద్ద మైనస్ పాయింట్. ఒకవేళ పాయింట్లు సమానమైతే, నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న జట్టుకే అవకాశం దక్కుతుంది. టేబుల్ టాప్ లో ఉన్న జట్లు వరుసగా ఓడిపోవాలి, మిడిల్ టేబుల్ లో ఉన్న జట్ల మధ్య ఫలితాలు ముంబైకి అనుకూలంగా రావాలి. ములతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, బూమ్రా ఫాంలో లేకపోవడం.. ముంబైకి శాపంగా మారింది. బౌలింగ్‌లో ఘజన్ ఫర్ ఒంటరి పోరాటం చేస్తున్నా, అతనికి తగిన సహకారం అందడం లేదు.

