Saturday, September 19, 2026 12:19 PM
Saturday, September 19, 2026 12:19 PM

ఏపీ కేబినేట్ సమావేశంలో సంచలన పరిణామం..!

కొత్త జిల్లాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంటకు ఏపీ ప్రభుత్వం తెరదించింది. తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలతో కలిపి ఏపీలో మొత్తం 28కి జిల్లాల సంఖ్య పెరుగుతుంది. ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Also Read : రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. మరీ ఇంత బరితెగింపా..!

కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాలను మార్చింది. రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు మార్చారు. రాజంపేటను కడప జిల్లాకు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు మార్చే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది కేబినేట్. వీటిపై ఉన్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వం పరిశీలించింది.

Also Read : ఏపీ రియల్ రంగానికి బూస్ట్..? మారుతోన్న పరిస్థితి..!

ఇదిలా ఉంచితే మంత్రివర్గ సమావేశంలో అసాధారణ, అనూహ్య ఘట్టం కనపడింది. క్యాబినెట్ లో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్ళు పెట్టారు. దీనితో సిఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులు రామ్ ప్రసాద రెడ్డిని ఓదార్చారు. కాగా తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. మొత్తం 21 అంశాలు అజెండాగా మంత్రిమండలి సమావేశం నిర్వహించింది సర్కార్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్