Wednesday, August 5, 2026 07:28 AM
Wednesday, August 5, 2026 07:28 AM

హెచ్ 1 బీ వీసా అప్లై చేసిన వారికి షాక్..?

ఎందరో భారతీయులకు అమెరికా వెళ్ళడం ఓ కల. విద్యార్ధిగా, హెచ్ 1 బీ వీసా హోల్డర్ గా అమెరికాలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అమెరికా వెళ్ళడం అంత ఈజీగా కాదు.. అనేది అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న డోనాల్డ్ ట్రంప్.. అక్కడ ఉన్న వారికి కూడా తనిఖీల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఇక వీసా ఇంటర్వ్యూలు కూడా ఆలస్యం అవుతున్నాయనే ఆవేదన కూడా ఉంది.

Also Read : అజారుద్దీన్ కు పదవీ గండం..? గవర్నర్ షాక్ ఇస్తారా..?

ఇంటర్వ్యూకి వెళ్తే.. ఏ సమస్యలు వస్తాయో, ఏ ప్రశ్నలు అడుగుతారో అనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఇక హెచ్ 1 బీ ఇంటర్వ్యూలకు సంబంధించి.. డిసెంబర్ 15 నుంచి ఇంటర్వ్యూలు మొదలుకావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు వాటిని అమెరికా ఎంబసీలు మొదలుపెట్టలేదు. దీనితో వీసా కోసం అప్లై చేసిన వారిలో కంగారు మొదలైంది. ఇప్పటికే ఫీజుల దెబ్బకు అల్లాడిపోతున్న వారికి ఇది నిజంగా షాక్ అనే చెప్పాలి. ఈ నేపధ్యంలో దీనిపై అమెరికా అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Also Read : రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. మరీ ఇంత బరితెగింపా..!

ఎందుకు ఆలస్యం అవుతున్నదో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అమెరికాకు అక్రమ వలసలను ప్రోత్సహించే వ్యక్తులను వేటాడుతున్నామని, అలాగే కంపెనీలను కూడా టార్గెట్ చేసిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. దేశంలో అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని, వారి గురించే ఆలస్యం అవుతోందని, వీసా కోసం దాఖలు చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. వీసాల విషయంలో మోసాలు చేస్తున్నారని, ఏజెంట్ లు చెప్పే మాటలు నమ్మవద్దు అంటూ హెచ్చరించారు. డబ్బులు, సమయం నష్టపోవద్దని సూచించారు. ఈ విషయంలో మోసాల నుంచి బయట పడటానికి ఏం చేయాలో చెప్తూ ఇటీవల ఓ వీడియో కూడా పోస్ట్ చేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. మరో ఆరు నెలల పాటు ఇంటర్వ్యూలు కష్టమేనని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్