దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని పార్టీలు ఏకమవుతాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయా ల్లో కీలక చర్చకు తెరలేపాయి. వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశాన్ని ప్రస్తావిస్తూ మమత కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు మా నాయకులను బెదిరిస్తున్నారన్న దీదీ.. చందన్‌నగర్ పోలీస్ కమిషనర్ తమ నాయకుడికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని, లేదంటే అరెస్టుచేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్టు చేస్తున్నారని.. ఎన్ని బెదిరింపులు వచ్చినా నిరసన మాత్రం కొనసాగుతుందని మమత తేల్చేశారు. మరోవైపు, టీఎంసీని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలాగే, కోల్‌కతలో నిరసనలు చేపట్టేందుకు తమ పార్టీకి అనుమతి నిరాకరిస్తే, ఆందోళనను జాతీయ రాజధాని వరకు విస్తరిస్తామని మమత హెచ్చరించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఘోర పరాజయం తర్వాత మమత చేసిన ఈ సంచలన ప్రకటన ఇండియా కూటమి పునరుజ్జీవన ప్రయత్నంగా కనిపిస్తోంది.
Also Read : అవి చేసే ముందు.. నటి ఘాటు వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ.. బీజేపీ చారిత్రక విజయం సాధించింది. మమతా బెనర్జీ స్వయంగా తన నియోజకవర్గంలో ఓడిపోయారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరపడి, బెంగాల్‌లో మొ దటిసారి బీజేపీ అధికారం చేపట్టింది. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అయితే ఈ ఫలితాలపై తొలి నుంచి మమత ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను “కుట్ర”గా, “రిగ్గిం గ్”గా అభివర్ణించి, రాజీనామా చేయడానికి కూడా నిరాకరించారు. పోస్ట్‌పోల్ హింసలో నాలుగు మరణాలు, వందలాది అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మమతా జాతీయ స్థాయిలో వ్యతిరేక పక్షాల ఐక్యతపై దృష్టి సారించారు. మే 24న ఫేస్ బుక్ లైవ్లో మాట్లాడుతూ, జూన్ మొదటి వారంలో ఢిల్లీలో ఇండియా బ్లాక్ సమావేశం జరుగుతుందని మమతా ప్రకటించారు. “మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. చివరి వరకు లొంగేది లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
ఈ సమావేశం బీజేపీ వ్యతిరేక వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. బెంగాల్ ఓటమి తర్వాత టీఎంసీ అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటోంది. దీంతో మమత జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను తిరిగి సాధించాలని చూస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కుదించుకుపోయిన ఇండియా బ్లాకు తిరిగి పుంజుకునేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా బ్లాక్ సమావేశం విజయవంతమైతే, బీజేపీ వ్యతిరేక పక్షాలు కలిసి పార్లమెంట్‌లో బలమైన వ్యతిరేకత చూపించవచ్చు. కానీ గతంలో రాష్ట్ర స్థాయిలో భేదాలు, నాయకత్వ వివాదాలు ఇండియా కూటమి పార్టీల మధ్య ఐక్యతను సవాలు చేస్తున్నాయి. మమతా బెనర్జీ ఆహ్వానం ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని గుర్తు చేస్తుంది.
Also Read : టీడీపీ ఖాతాలో మరో కేబినెట్ బెర్త్..!
అయితే, ఇది కేవలం ఓటమి తర్వాతి ఆత్మరక్షణ వ్యూహం కాకుండా, నిర్మాణాత్మక ప్రత్యామ్నాయం మారుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ విజయాలు ప్రజల మార్పు కోరికను సూచిస్తున్నాయి. వ్యతిరేక కూటమి అభివృద్ధి, సామాజిక సామరస్యం, పారదర్శకత వంటి అంశాలపై స్పష్టత లేకుండా కేవలం “బీజేపీ వ్యతిరేకత” తో ముందుకు సాగడం కష్టం. మమతా లాంటి అనుభవజ్ఞులు నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేయాలి. ఇండియా బ్లాక్ సమావేశం ఫలితాలు దేశ రాజకీయ భూమికను మార్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ చివరికి తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఇండియా బ్లాక్ రాజకీయాలు కేవలం అధికార పోరాటం కాదు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలని సూచిస్తున్నారు.

