Sunday, June 7, 2026 12:14 AM
Sunday, June 7, 2026 12:14 AM

ఎల్పీజీ కష్టాలు.. ఉపాధిపై ప్రభావం..!

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్లు, హాస్టల్, మెస్సులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, ఇంధన సరఫరా ఆటంకాలు, అంతర్జాతీయ మార్కెట్ ధరల పెరుగుదల ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలు. 2026లో ఏకంగా రూ.993 వరకు పెంచడంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071.50కి, ఇతర నగరాల్లో రూ.3,0000 మధ్యకు చేరింది. ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో హోటల్ ఇండస్ట్రీపై వినాశకర ప్రభావం పడుతోంది. హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లు ఇప్పటికే ఈ సంక్షోభంపై హెచ్చరికలు ఇస్తున్నాయి.

చిన్న, మధ్య తరహా హోటల్లు, కేటరింగ్ యూనిట్లు, టీ స్టాల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక చోట్ల మెనూ కుదించడం, ఓపెనింగ్ గంటలు తగ్గించడం, తాత్కాలిక మూసివేతలు జరుగుతున్నాయి. ముంబైలో సుమారు 20 శాతం హోటల్స్ ఇప్పటికే మూసివేసినట్లు హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపాయి. సరఫరా కొనసాగకపోతే మరిన్ని మూసివేతలు జరుగుతాయని కూడా హెచ్చరికలు వచ్చాయి. బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో సమస్య తీవ్రంగా మారుతోంది. ఒక్క సిలిండర్ ధర పెరగడంతో నెలవారీ ఖర్చులు లక్షల్లో పెరుగుతున్నాయి. ఇంధన ఖర్చు హోటల్ ఆపరేషన్స్‌లో పెద్ద భాగం కావడంతో మార్జిన్లు తగ్గి, లాభాలు నష్టాల్లోకి మారుతున్నాయి. అనేక హోటల్స్ కట్టెలు, డీజిల్ చూలాలు, ఇండక్షన్ వంటి ప్రత్యామ్నాయాలకు మారుతున్నా యి. ఇది ఆహార నాణ్యత, ఖర్చులు రెండింటినీ ప్రభావితం చేస్తోంది. దీంతో ఉపాధి కరువవుతోంది.

Also Read : ఫోర్స్ లేబర్.. ట్రంప్ డబుల్ గేమ్..!

హోటల్ ఇండస్ట్రీ దేశంలో పెద్ద ఉపాధి కల్పకం. లక్షలాది మంది వంటవాళ్లు, సర్వర్లు, సప్లయ్ చైన్ వర్కర్లు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. మూసివేతలు, హోటళ్ల నిర్వహణ తగ్గడం వల్ల అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ పునరుద్ధరణలో ఉండగా ఈ ఎల్పీజీ సంక్షోభం మరిన్ని ఉద్యోగాలను హరించే ప్రమాదం ఉంది. మెనూ ధరలు 10 నుంచి 15 శాతం పెంచాల్సి వచ్చినా అది కస్టమర్లను దూరం చేస్తుందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్టల్,పేయింగ్ గెస్ట్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. హాస్టల్, పేయింగ్ గెస్ట్ మెస్సులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సిలిండర్ల సరఫరా కొరత, ధరల పెరుగుదల వల్ల మెనూ మార్చడం, భోజన నాణ్యత తగ్గడం సాధారణమవుతోంది. హైదరా బాద్, తమిళనాడు వంటి చోట్ల పీజీ యజమానులు అద్దెలు 10 శాతం వరకు పెంచారు. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ రోజువారీ భోజన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కట్టెలు, ఇతర ఇంధనాలకు మారడం ఆరోగ్య, పర్యావరణ సమస్యలను కూడా తీసుకొస్తోంది. ప్రభుత్వం గృహ ఎల్పీజీకి ప్రాధాన్యత ఇస్తున్నందున కమర్షియల్ వినియోగదారులు బ్లాక్ మార్కెట్, అధిక ధరలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సిలిండర్ రూ.5 వేల వరకు చేరినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ అసోసియేషన్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసి, కమర్షియల్ ఎల్పీజీని అత్యవసర సేవగా పరిగణించి సరఫరా పెంచాలని, ధరలను స్థిరీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Also Read : తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే.. ఇలియానా సంచలన కామెంట్స్

కానీ ఇప్పటికీ సమస్య పూర్తిగా తీరలేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలికంగా ప్రత్యామ్నాయ ఇంధనాలైన బయోగ్యాస్, ఎలక్ట్రిక్, సోలార్ కుకింగ్ వంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చిన్న వ్యాపారాలకు సబ్సిడీలు, రిలీఫ్ ప్యాకేజీలు ఇవ్వాలి. లేకపోతే ఆహార ధరలు పెరగడం, ఉపాధి నష్టం, విద్యార్థి సమస్యలు సామాజిక ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ఈ సంక్షోభం కేవలం హోటల్ యజమానుల సమస్య కాదు.. సామాన్యుల జీవన విధానం, యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమగ్ర పరిష్కారం అందించాలి. లేనిపక్షంలో మరిన్ని మూసివేతలు, ఉపాధి కరువు, ఆహార అసమానతలు తప్పవు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్యా హై అలర్ట్...

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతున్న...

వైసీపీ నేత కబ్జాపై...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండేళ్ల...

ఏఐ టెక్నాలజీ.. రికార్డు...

తిరుమల మరో రికార్డును సొంతం చేసుకుంది....

మద్యం కుంభకోణం.. వైఎస్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం...

టీవీకే తరఫున రాఘవ...

తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక...

రఘురామపై ఇద్దరి దాడి.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల డిప్యూటీ స్పీకర్...

పోల్స్