Saturday, August 1, 2026 08:36 PM
Saturday, August 1, 2026 08:36 PM

మద్యం కుంభకోణం.. వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరగబోతుందా?.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈడీ సిద్ధమవుతోందంటూ వెలువడుతున్న కథనాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను విచారించిన దర్యాప్తు సంస్థలు.. ఇప్పుడు నేరుగా జగన్ వైపు దృష్టి సారించాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read : రాజ్యసభ అభ్యర్థి ఎంపిక.. పవన్‌కు అగ్నిపరీక్ష..!

మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయంగా కీలకంగా భావిస్తున్న వ్యక్తులను ప్రశ్నించింది. కొందరిని అరెస్టు కూడా చేసింది. అయితే ఇంతవరకు జగన్‌ను అధికారికంగా విచారించలేదు. ఇదే సమయంలో, మద్యం విధానంలో జరిగిన అక్రమాల వల్ల అంతిమంగా రాజకీయ ప్రయోజనం పొందింది జగన్ నాయకత్వంలోని అప్పటి ప్రభుత్వమేనన్న వాదనలు అధికార పక్షం నుంచి వినిపిస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలను బలపరిచే ప్రత్యక్ష ఆధారాలను దర్యావు సంస్థలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. దీంతో కేసు విచారణ కంటే రాజకీయ ప్రచారమే ఎక్కువగా జరుగుతోందన్న విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.

సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ జగన్ పేరును ఇప్పటివరకు చార్జిషీటులో చేర్చలేదు. అంతేకాకుండా ఆయనకు నోటీసులు కూడా జారీ కాలేదు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఈడీ విచారణ అంశం తెరపైకి రావడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. నిజంగానే బలమైన ఆధారాలు ఉంటే సిట్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నాయి. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కేసుల పేరుతో రాజకీయం చేస్తున్నానరే ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, కీలక నాయకులపై కేసులు నమోదు చేసి విచారణలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరోవైపు, ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈడీ రంగప్రవేశం చేస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈడీ విచారణలో జగన్ పేరును ప్రస్తావిస్తే, అది రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలకు బలం చేకూర్చే అంశంగా మారవచ్చు. అదే సమయంలో, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్నారన్న విమర్శలు కూడా మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు కేసులో పలువురు నిందితులను విచారించారు. అయితే ఆ విచారణలో ఏమి తేలింది.. ఏ ఆధారాలు లభించాయి.. అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, తాజాగా జగన్ విచారణకు రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు ఇస్తున్నాయి.

Also Read : రఘురామపై ఇద్దరి దాడి.. మాస్టర్ ప్లాన్ ఎవరిది?

అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మాజీ ముఖ్యమంత్రిని ఏదైనా కేసులో నేరుగా విచారించడం లేదా నిందితుడిగా చేర్చడం అనేది సాధారణ విషయం కాదు. అందుకు పటిష్టమైన ఆధారాలు, చట్టపరంగా బలమైన కారణాలు అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది అత్యంత కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే, మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు కేవలం అవినీతి ఆరోపణలతో కాకుండా రాజకీయ భవిష్యత్తులను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈడీ విచారణ వార్తలు నిజమవుతాయా? జగన్‌కు నోటీసులు జారీ అవుతాయా? లేక ఇది రాజకీయ ప్రచారంలో భాగంగానే మిగిలిపోతుందా? అన్న అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్