Saturday, June 6, 2026 12:03 AM
Saturday, June 6, 2026 12:03 AM

ఫోర్స్ లేబర్.. ట్రంప్ డబుల్ గేమ్..!

రాజకీయాల్లో.. అంతర్జాతీయ వాణిజ్యంలో షాకులు ఇవ్వడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా.. భారత్‌తో దోస్తీ అంటే ప్రాణమిస్తాం, వ్యాపారాన్ని పైకి తీసుకెళ్తాం అంటూనే.. టేబుల్ కింద నుంచి మెల్లగా ‘టారిఫ్’ కత్తి దూశారు. పైన చిరునవ్వులు.. లోపల ట్యాక్స్ వసూళ్లు.. ఇదీ ప్రస్తుత అమెరికా సర్కార్ నయా ట్రెండ్. ప్రస్తుతం నడుస్తున్న సీన్ చూస్తుంటే.. “బయటకి చూస్తే స్నేహం.. లోపల చూస్తే సుంకం” అన్నట్టుగా ఉంది అమెరికా వ్యవహారం. పాత సినిమా.. కొత్త పోస్టర్.. ‘ఫోర్స్ లేబర్’ ట్విస్ట్!

Also Read : కేటీఆర్ పాదయాత్ర.. వర్కవుట్ అవుతుందా..?

గతంలో ట్రంప్ భారత్‌పై వేసిన కొన్ని టారిఫ్ ప్లాన్లను అమెరికా సుప్రీంకోర్టు ‘ఇది చెల్లదు’ అంటూ కొట్టిపారేసింది. దీంతో డైరెక్టర్ ట్రంప్ రూటు మార్చారు. పాత సినిమా ఫ్లాప్ అయితే.. దానికి ‘ఫోర్స్ లేబర్’ బలవంతపు చాకిరీ అనే కొత్త టైటిల్ పెట్టి సరికొత్త పోస్టర్ తో మార్కెట్లోకి వదిలారు. అమెరికా లాజిక్ ఏంటంటే.. భారత్, చైనా, జపాన్ లాంటి దాదాపు 60 దేశాల్లో కార్మికులతో బలవంతంగా పని చేయిస్తున్నారట. అలా తక్కువ ఖర్చుతో తయారైన వస్తువులు అమెరికాలోకి వస్తే.. అక్కడ ఉన్న లోకల్ అమెరికన్ కార్మికులు నష్టపోతారట.. భలే ఉంది కదా అమెరికా ప్రేమ?

ఈ నెపంతో భారత్‌తో పాటు మరో 54 దేశాల ఉత్పత్తులపై ఏకంగా 12.5 శాతం వరకు అదనపు టారిఫ్ బాదడానికి అమెరికా రంగం సిద్ధం చేసింది. దీనిపై ‘ప్రజాభిప్రాయాలు’ సేకరించి.. ఆపై పబ్లిక్ హియరింగ్ పెట్టి మరీ ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో డైలాగులు.. వాషింగ్టన్‌లో ట్యాక్స్లు.. ఇక్కడ అసలైన కామెడీ ఏంటంటే.. ఒకవైపు వాషింగ్టన్‌లో ఈ టారిఫ్ బాంబుల స్క్రిప్ట్ రెడీ అవుతుంటే.. మరోవైపు బ్రెండన్ లించ్ నేతృత్వంలో అమెరికా అధికారుల బృందం ఢిల్లీలో లంచ్ చేస్తూ బిజినెస్ చర్చలు జరుపుతోంది. మార్కెట్ యాక్సెస్ ఎలా పెంచాలి? కస్టమ్స్ డ్యూటీలు ఎలా తగ్గించాలి? పెట్టుబడులు ఎలా పెంచాలి? అంటూ భారత్ అధికారులతో సీరియస్‌గా చర్చిస్తున్నారు.

Also Read : రష్యాలో లోకేష్ మిషన్.. ఏపీకి భారీ పెట్టుబడులు

నిన్న మొన్నటి వరకు భారత ఎగుమతులపై పన్నులు తగ్గిస్తామని నమ్మించారు. మనవాళ్లు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకునేలోపే.. వెనక నుంచి ‘ఫోర్స్ లేబర్’ అంటూ పెద్ద షాకే ఇచ్చారు. ‘గుడ్ పోలీస్ – బ్యాడ్ పోలీస్’ మైండ్ గేమ్ అమెరికా ఇంటర్నేషనల్ డిప్లమసీలో ఇదో రకమైన బ్రాండ్ స్టైల్. వాణిజ్య చర్చల్లో పైచేయి సాధించడానికి ఒకేసారి ఇద్దరు వ్యక్తులుగా నటిస్తారు. ఒక చేత్తో ఒప్పంద పత్రం అందిస్తూ.. మరో చేత్తో టారిఫ్ గన్ చూపించడం ట్రంప్ మార్క్ ‘మైండ్ గేమ్’ అని బిజినెస్ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో వస్తువుల కంటే ‘వ్యూహాలే’ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మరి అమెరికా ఆడుతున్న ఈ ‘హైడ్రామా’ మైండ్ గేమ్‌కు భారత్ ఎలాంటి ‘కౌంటర్’ ఇస్తుందో చూడాలి. టారిఫ్ తుఫాన్‌ను తట్టుకుని నిలబడతామా.. లేక అమెరికాకే రివర్స్ షాక్ ఇస్తామా అనేది మున్ముందు తేలనుంది.!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రఘురామపై ఇద్దరి దాడి.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల డిప్యూటీ స్పీకర్...

విశాఖ తీరంలో చంద్రబాబు...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం...

రాజ్యసభ అభ్యర్థి ఎంపిక.....

అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రస్తుత రాజ్యసభ...

ఏపిలో దూకుడు పెంచిన...

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం...

రష్యాలో లోకేష్ మిషన్.....

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త మైలురాళ్లు...

కేబినెట్ విస్తరణ.. జస్ట్...

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై కొద్ది రోజులుగా...

పోల్స్