Saturday, June 6, 2026 07:59 PM
Saturday, June 6, 2026 07:59 PM

ఏఐ టెక్నాలజీ.. రికార్డు నెలకొల్పిన టీటీడీ..!

తిరుమల మరో రికార్డును సొంతం చేసుకుంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, స్వామి దర్శనం కల్పించడంలో ప్రస్తుత కూటమి సర్కార్, టీటీడీ పాలకమండలి చేపట్టిన మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మే నెలలో శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం హుండీ ఆదాయం ఒక్క నెలలోనే రూ.120 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మే నెలలో తిరుమల శ్రీవారిని ఏకంగా 25,46,168 మంది భక్తులు దర్శించుకున్నారు. 2025 మే నెలతో పోలిస్తే అదనంగా 2,85,308 మందికి దర్శన భాగ్యాన్ని కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డు అని అధికారులు తెలిపారు.

Also Read : ఫోర్స్ లేబర్.. ట్రంప్ డబుల్ గేమ్..!

ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌తో భక్తుల కదలికలను నిరంతరం స్వయంగా పర్యవేక్షించడంతో ఇంతమంది భక్తులు నిర్విఘ్నంగా దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అదే విధంగా నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూనే క్యూ లైన్ అగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. మొత్తం 1.12 కోట్ల మందికి అన్నప్రసాదాలను అందించారు. 2025 మే నెలతో పోలిస్తే 15.71 లక్షలు అధికం. మే నెలలో హుండీ ఆదాయం రూ.120 కోట్లుగా అధికారులు తెలిపారు. లడ్డూ విక్రయాలు సైతం భారీ ఎత్తున 1.21 కోట్ల వరకు జరిగాయి. ఇక రికార్డు స్థాయిలో 14,38,385 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే విధంగా బంగారం, వెండి డాలర్ల అమ్మకం, రిసెప్షన్ ఆదాయం సహా వివిధ విభాగాల్లో సైతం టీటీడీ కొత్త రికార్డులు నమోదు చేసింది.

Also Read : టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ..?

సమయానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో తిరుమల పోటు విభాగం మే నెలలో రోజుకు సగటున దాదాపు 4.08 లక్షల లడ్డూలు తయారు చేసింది. లడ్డూ నాణ్యత కాపాడేందుకు ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను పోటులో ఉపయోగించారు. మే నెలలో ప్రధానంగా ఒక రోజులో సర్వదర్శనానికి అత్యధికంగా దాదాపు 176 గంటల 24 నిమిషాలను కేటాయించారు. ఇక నడక మార్గం నుంచి వచ్చేవారిని పర్యవేక్షణతో అంచనా వేసి, అన్ని విధాలైన చర్యలను చేపట్టారు. అంతేకాకుండా క్యూలైన్లలో భక్తుల రద్దీ, కదలికల్ని అనుక్షణం గమనించారు. కంపార్టుమెంట్ల లోకి ప్రవేశించిన దగ్గర మొదలు గంటల గంటలు సమయాన్ని గణిస్తూ, ఎస్ఈడీ, ఎస్ఎస్‌డీ టోకెన్ల ఎంట్రీలను కెమెరా పుటేజీలతో బేరీజు వేసుకుంటూ స్వామి వారి దర్శనానికి పంపించారు. దాంతో దీని ఫలితంగా మే 24వ తేదీన ఒక్క రోజే అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెలలోనే దాదాపు నాలుగు సార్లు 90,000 మార్కు దాటడం విశేషం. మే 3వ తేదీన అత్యధికంగా రూ.5.06 కోట్లు స్వామివారి హుండీ ద్వారా ఆదాయం వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్యా హై అలర్ట్...

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతున్న...

వైసీపీ నేత కబ్జాపై...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండేళ్ల...

మద్యం కుంభకోణం.. వైఎస్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం...

టీవీకే తరఫున రాఘవ...

తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక...

రఘురామపై ఇద్దరి దాడి.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల డిప్యూటీ స్పీకర్...

విశాఖ తీరంలో చంద్రబాబు...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం...

పోల్స్