Tuesday, August 25, 2026 08:51 AM
Tuesday, August 25, 2026 08:51 AM

పల్నాడులో లావుతో గోక్కుంటున్న బొల్లా.. విడదల పరిస్థితే..?

పల్నాడు జిల్లా రాజకీయం మరోసారి అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో తీవ్రస్థాయికి చేరింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య నడుస్తున్న ఈ సవాల్‌ యుద్ధం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో రాజకీయంగా తలపడి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిన మాజీ మంత్రి విడదల రజనీ ఉదంతాన్ని పల్నాడు ప్రజలు మరవక ముందే, ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు అదే తరహాలో లావుతో నేరుగా ఢీకొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్..!

లిక్కర్ స్కామ్ నుంచి కోట్ల రూపాయల విలువైన భూ దందాల వరకు ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో బురద జల్లుకుంటూ పల్నాడు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించారు. తనపై వచ్చిన ప్రతీ ఆరోపణను ఎంపీ లావు తీవ్రంగా ఖండించడమే కాకుండా, బొల్లా బ్రహ్మనాయుడు గతంలో చేసిన చీకటి వ్యాపారాల చిట్టా అంతా తన వద్ద సిద్ధంగా ఉందని హెచ్చరించడం పల్నాడులో రాజకీయ సెగలు రేపుతోంది. తనపై బొల్లా బ్రహ్మనాయుడు చేసిన లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యంత ఘాటుగా స్పందించారు.

మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒకవేళ తనపై చేసిన ఆరోపణలను ఒక్కటంటే ఒక్కటి నిరూపించినా సరే, తాను తక్షణమే రాజకీయాల నుంచి శాశ్వతంగా గుడ్‌ బై చెబుతానని బహిరంగ సవాల్ విసిరారు. సొంతంగా అక్రమ భూ దందాల బురదలో కూరుకుపోయిన బొల్లా బ్రహ్మనాయుడు, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి పల్నాడులో ఉన్న ఇతర క్లీన్ ఇమేజ్ నేతలను కూడా అదే బురదలోకి లాగాలని చూడటం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.

Also Read : మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సమరం..?

జనసేన పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడి భూ వ్యవహారంలో జోక్యం చేసుకుని, దాన్ని సెటిల్ చేయడానికి బొల్లా బ్రహ్మనాయుడు ఏకంగా రూ.31 కోట్ల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకున్నారని ఎంపీ లావు సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొల్లా సాగించిన భూ కబ్జాలు, అవినీతి అక్రమ వ్యవహారాలకు సంబంధించిన పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు మరియు సమాచారం ప్రస్తుతం తన వద్ద సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం బొల్లాపై కేసులు పెట్టించాలంటే ఇప్పుడే, ఈ క్షణమే పెట్టించగలనని, కానీ కొందరిలా తాను అనవసరంగా ముందే హడావుడి చేసి సౌండ్ చేయనని, అంతా వెనక ఉండి నిశ్శబ్దంగా చేసి చూపిస్తానని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్