Wednesday, May 6, 2026 08:13 PM
Wednesday, May 6, 2026 08:13 PM

చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యపై విచారణ జరగనుంది. ముడా భూ కుంభకోణం కేసులో అవినీతి వ్యతిరేక పోరాటం చేసే ముగ్గురు కార్యకర్తలు, ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం మరియు స్నేహమయి కృష్ణ పిటీషన్ దాఖలు చేయడంతో ఈ కేసుపై విచారణకు గవర్నర్ ఆదేశించారు. అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 మరియు సెక్షన్ 218 ప్రకారం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించే అవకాశం ఉంది.

తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి ‘షోకాజ్ నోటీసు’ జారీ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వర్గం… ముఖ్యమంత్రి పై విచారణకు ప్రాసిక్యూషన్ ను అనుమతించవద్దు అంటూ కోరింది. కోట్లాది రూపాయల కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని తమ పిటీషన్ లో ఆ ముగ్గురు పేర్కొన్నారు. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు చట్టవిరుద్ధమని, దీని వల్ల ఖజానాకు ₹ 45 కోట్ల నష్టం వాటిల్లిందని లోకాయుక్త పోలీసులకు జూలైలో అబ్రహం ఫిర్యాదు చేసారు.

ఫిర్యాదులో సిద్ధరామయ్య, భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారులు ఉన్నారు. ఇక ఈ కేసులో భూ కుంభకోణంలో సిద్ధరామయ్య, అతని భార్య మరియు ముడా మరియు పరిపాలనా అధికారుల ప్రమేయం ఉందని మరో కార్యకర్త కృష్ణ ఆరోపణలు చేసారు. తన భార్యకు పరిహారం అందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చాడని సిద్ధరామయ్య పేర్కొనగా… 2004లో మల్లికార్జున అక్రమంగా సేకరించి ప్రభుత్వ, రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కృష్ణ మండిపడ్డారు.

ఈ భూమిని 1998లో కొనుగోలు చేసినట్లు చూపారు. 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూమికి పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే పార్వతి కోరారు. ఈ కేసులో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల ప్రారంభంలో బెంగళూరు నుండి మైసూరు వరకు వారం రోజుల పాదయాత్ర నిర్వహించింది. అయితే దీనిపై స్పందించిన సిద్దరామయ్య తన భార్యకు బిజెపి అధికారంలో ఉన్నప్పుడే పరిహారం అందినట్టు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్