Sunday, June 21, 2026 12:01 AM
Sunday, June 21, 2026 12:01 AM

వైసీపీలో చీలికకు కారణం అయిన జగన్ ఢిల్లీ దీక్ష?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్ధమవుతుంది. ఢిల్లీ లో ధర్నాకు జగన్ దిగడం ద్వారా అక్కడి జాతీయ మీడియాను అలాగే ఇతర జాతీయ పార్టీలను ఆహ్వానించి వాళ్లకు యేవో చూపించి కాస్త హడావుడి చేసే ప్రయత్నం చేసారు. దీనికి రెండు పార్టీల నుంచి మాత్రమే మద్దతు వచ్చింది. అది కూడా అరకొర మద్దతు అనే చెప్పాలి. ఇక జగన్ కు వాళ్ళు మద్దతు ఇవ్వడాన్ని చూసి… ఇండియా కూటమిలో ఆయన చేరే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

అయితే ఇది విజయసాయి కి ఏ మాత్రం నచ్చడం లేదని రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆయన బిజెపిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంచితే… ఇప్పుడు అసలు జగన్ ఢిల్లీ పర్యటన లక్ష్యం ఏంటీ అనేది ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా జాతీయ మీడియాలో హడావుడి చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఏపీలో శాంతి, భద్రతలు అదుపులో లేవనే సందేశాన్ని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడమే లక్ష్యంగా ఆయన ధర్నా చేసినట్టే కనపడుతుంది.

గత అయిదేళ్ళ నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెనక్కు వెళ్ళారు. దీనితో రాష్ట్రానికి వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. అసలు 50 రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి కుట్రలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనేది ఒక ప్రణాళికతో లేకపోతే గతంలో మాదిరిగానే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్