Wednesday, August 5, 2026 06:21 AM
Wednesday, August 5, 2026 06:21 AM

ఏపీలో బాబు ఇలాంటి చట్టం తేగలరా?

గత పదేళ్ళ నుంచి దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు తాము అధికారం కోరుకుంటూ తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తుంటే మరికొన్ని మీడియా సంస్థలు ఏకంగా అసలు నిజాలు కాని విషయాలను జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం గట్టిగా చేసాయి. జనాలు కూడా అది ఎంత వరకు నిజం అనేది తెలియకుండా ప్రచారాలను నమ్మడం ఆశ్చర్యం కలిగించిన విషయంగా చెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ లక్ష్యంగా బిజెపి అదే తరహాలో ఆరోపణలు చేసేది.

ఇక ఏపీలో అయితే టీడీపీ అనే పార్టీని లేకుండా చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు జరిగాయి అనే మాట వాస్తవం. అయితే ఇటీవల రష్యాలో అక్కడి అధ్యక్షుడు తీసుకొచ్చిన ఒక చట్టం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎలాంటి నిజానిజాలు లేకుండా ఫేక్ న్యూస్ ప్రసారం చేసిన మీడియా సంస్థకు ఆ వార్త నిజమని రుజువు చేసేందుకు 1 నెల సమయం ఇస్తానని, లేకుంటే 15 ఏళ్ల జైలు శిక్ష తప్పదని చట్టం చేయడంతో కొన్ని మీడియా సంస్థలు రష్యాను వదిలి వెళ్ళాయి అని వార్తలు వస్తున్నాయి.

ఈ చట్టం చేసిన తర్వాత బీబీసీ, డ్యుయిష్ వెల్లే, అల్ జజీరా, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులంతా తమ బ్యాగులు సర్దుకుని రష్యా నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వ్లాదిమిర్ పుతిన్ వారిని దేశం విడిచి వెళ్లమని ఆదేశించలేదు. కాని వాళ్ళు మాత్రం దేశం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు నిజాలు చూపిస్తే దేశం నుంచి వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడు చట్టం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం రావాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్